యాప్నగరం

Google chrome వాడుతున్నారా?.. చిక్కుల్లో పడతారు జాగ్రత్త!

గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? వెంటనే కొత్త అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి లేకపోతే.. మీ కంప్యూటర్, ఫోన్లను హ్యాకర్లు హైజాక్ చేసేస్తారు.

Samayam Telugu 3 Sep 2019, 12:35 am
మీ ఫోన్ లేదా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లలో గూగుల్ క్రోమ్ (Google chrome) బ్రౌజర్ వాడుతున్నారా? అయితే, వెంటనే దాన్ని అప్‌డేట్ చేసుకోండి. లేకపోతే మీ డేటా లేదా మీ రహస్య సమాచారం ఇతరుల చేతులకు చిక్కే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని గూగుల్ స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు అర్జెంట్ అప్‌డేట్‌ను ఇష్యూ చేసినట్లు ‘Metro’ వెబ్‌సైట్ వెల్లడించింది.
Samayam Telugu cyber_crime_1529742819


బ్రౌజర్‌లోని కంటెక్ట్స్‌లో గల ఆర్బిట్రరీ కోడ్‌ను హ్యాకర్స్ చేజిక్కించుకున్నారని, క్రోమ్ వినియోగదారుల సీక్రెట్ డేటాను చూడటమే కాకుండా, దాన్ని ఎడిట్ లేదా డిలీట్ చేయగలరని పేర్కొంది. ముఖ్యంగా బ్రౌజర్‌లో నిక్షిప్తమయ్యే బ్యాంక్ వివరాలు లేదా రహస్య సమాచారాన్ని హ్యాకర్లు చేజిక్కించుకుని బెదిరింపులకు పాల్పడే అవకాశాలున్నాయి.

Read also: సెక్స్ హ్యాట్రిక్.. ముగ్గురు అమ్మాయిలతో క్రికెటర్ షేన్‌వార్న్ శృంగార రచ్చ!

సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఈ సమస్యను గుర్తించింది. హ్యాకర్లు ప్రస్తుత వినియోగదారుల సమాచారాన్ని సేకరించి.. అవే వివరాలతో కొత్త అకౌంట్‌ను సృష్టించుకోవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో గూగుల్ ఈ సమస్యను పరిషర్కించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే Macలో ఈ సమస్యను పరిష్కరించింది. రానున్న వారాల్లో లినక్స్, విండోస్‌లలో కూడా ఈ సమస్యను పరిష్కరించనుంది. హ్యాకర్లు చిక్కకూడదంటే క్రోమ్ వినియోగదారులు గుర్తింపు పొందని వెబ్‌సైట్ లింకులు, హైపర్ లింకులు క్లిక్ చేయకపోవడమే ఉత్తమం. కాబట్టి.. జాగ్రత్త!!

Read also: రోడ్డును చంద్రుడిలా మార్చేసిన ఆర్టిస్ట్, వ్యోమగామిలా మారి భలే ట్విస్ట్ ఇచ్చాడు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.