యాప్నగరం

‘జిమ్‌కు రాకపోతే రేప్’.. విద్యార్థినిలకు షాకిచ్చిన శిక్షకుడు!

జిమ్‌కు రాని విద్యార్థినీలను అత్యాచారం చేయడమే సరైన శిక్ష అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శిక్షకుడు.

Samayam Telugu 25 Apr 2019, 8:26 pm
‘‘రోజూ జిమ్‌కు వచ్చి.. వ్యాయమాలు చేయని అమ్మాయిలకు కఠిన శిక్ష విధించాలి. వారికి అత్యాచారమే తగిన శిక్ష’’ అంటూ ఓ జిమ్ ఇన్‌స్ట్రక్టర్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. విద్యార్థుల ఆగ్రహానికి గురైన ఆ శిక్షకుడు చివరికి ఉద్యోగాన్ని కోల్పోవలసి వచ్చింది. ఈ ఘటన స్కాట్‌ల్యాండ్‌లోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది.
Samayam Telugu 0_ross-brain-instagram-1


యూనివర్శిటీలో సీనియర్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న రాస్ బ్రయిన్.. ఇటీవల యూనివర్శిటీ స్పోర్ట్స్, ఎక్స్‌ర్‌సైజ్ క్లబ్ వాట్సాప్‌ గ్రూప్‌లో జిమ్‌కు రాకుండా తిరిగే అమ్మాయిలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ‘‘ఆమెను రేప్ చేయండి. రేప్ లేదా 600 బర్పీలు(బస్కీలు)లో ఏదో ఒకటి ఎంపిక చేసుకునే అవకాశం ఆమెకు ఇవ్వాలని అని పేర్కొన్నాడు. దీంతో ఆ మెసేజ్‌ పెద్ద దుమారమే రేపింది. అతన్ని విధుల నుంచి తొలతగించాలని కోరుతూ యునివర్శిటీలోని 800 మంది విద్యార్థినీలు సంతకాలు చేసిన లేఖను ప్రిన్సిపల్, వైస్‌ఛాన్సలర్ పీటర్ మాదెసన్‌కు అందించారు. దీంతో అతడికి ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.