యాప్నగరం

15 ఏళ్లుగా ఉద్యోగానికి వెళ్లకుండానే జీతం.. చివరికి ఇలా దొరికాడు!

కాటాన్జారోలోని కాలాబ్రియన్ నగరంలోని ఓ హాస్పిటల్‌ ఉద్యోగి 2005 నుంచి విధులకు హాజరు కావడం లేదు. అయితే, ఈ విషయాన్ని హెచ్‌ఆర్ డిపార్టుమెంట్ గుర్తించలేదు. అతడు గైర్హాజరైనా అటెండెన్సు ఎలా పడిందనేది మాత్రం మిస్టరీగా మారింది.

Samayam Telugu 22 Apr 2021, 2:26 pm

ప్రధానాంశాలు:

  • 2005 నుంచి విధులకు గైర్హాజరైన హాస్పిటల్ ఉద్యోగి.
  • 15 ఏళ్లుగా జీతం చెల్లిస్తున్న యాజమాన్యం.
  • ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు, పోలీసులు.

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Representational Image
క్క రోజు విధులకు హాజరు కాకపోయినా.. మన బాస్ లేదా హెచ్‌ఆర్ డిపార్టుమెంటుకు తెలిసిపోతుంది. అలాంటిది అతడు 15 ఏళ్లుగా విధులకు గైర్హాజరైనా ఎవరూ కనిపెట్టలేకపోయారు. పైగా.. అతడికి క్రమం తప్పకుండా జీతం పడుతూనే ఉంది. ఈ ఘటన ఇటలీలోని పుగ్లీసీ సియాసియో ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
కాటాన్జారోలోని కాలాబ్రియన్ నగరంలో ఉన్న ఈ హాస్పిటల్‌లో ఓ ఉద్యోగి 2005 నుంచి విధులకు హాజరు కావడం లేదు. అయితే, ఈ విషయాన్ని హెచ్‌ఆర్ డిపార్టుమెంట్ గుర్తించలేదు. అతడు గైర్హాజరైనా అటెండెన్సు ఎలా పడిందనేది మాత్రం మిస్టరీగా మారింది. అయితే, ఇందుకు అతడు కొన్ని విధానాలు పాటించాడని తెలిసింది. చివరికి.. అతడు తన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా హాస్పిటల్ డైరెక్టర్‌ను కూడా బెదిరించాడు. దీంతో అతడు నిందితుడికి సహకరించినట్లు తెలిసింది.

ఆ డైరెక్టర్ పదవీ విరమణ పొందిన తర్వాత కూడా హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్ అతడి అటెండెన్సులో లోపాలను గుర్తించలేకపోయింది. ఫలితంగా అతడికి 15 ఏళ్లుగా జీతం పడుతూనే ఉంది. ఇలా రూ.5,38,000 పౌండ్లు (రూ.4.85 కోట్లు) జీతాన్ని చెల్లించారు. గతేడాది కరోనా వైరస్ నేపథ్యంలో విధులకు హాజరవుతున్న ఉద్యోగుల జాబితా తయారీ సమయంలో ఈ విషయం బయటపడింది. ఈ విషయం తెలిసి అతడి తోటి ఉద్యోగులు కూడా షాకయ్యారు. అతడు హాజరుకాకపోయినా జీతం ఎలా చెల్లించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ అందమైన అమ్మాయి.. 53 ఏళ్ల పురుషుడు, ఔను.. నిజం!ఈ విషయం తెలియగానే అతడిని విధుల నుంచి తొలగించారు. అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. హెచ్ఆర్‌లోని ఆరుగురు మెనేజర్లను విచారించారు. ఆ విభాగంలో ఎవరైనా అతడికి సహకరించి ఉండవచ్చని భావిస్తున్నారు. స్థానిక మీడియా అతడిని ‘కింగ్ ఆఫ్ అబ్సెన్టీస్’‌గా అభివర్ణిస్తోంది. పోలీసులు సైతం రంగంలోకి దిగి అతడి అటెండెన్స్, శాలరీ రికార్డులు, తొటి ఉద్యోగులు స్టేట్‌మెంట్లను సేకరించింది. ప్రస్తుతం నిందితుడి వయస్సు 67 ఏళ్లు. మరి కోర్టు అతడికి శిక్ష విధిస్తుందా? లేదా అతడు హాజరుకాకపోయినా జీతం చెల్లించిన హాస్పిటల్ యాజమాన్యానికి జరిమానా విధిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.