యాప్నగరం

video: సర్టిఫికెట్ పొందిన ఫ్లైయింగ్ కారు.. డ్రైవర్‌కి పైలెట్ లైసెన్స్ మస్ట్

ఒకప్పుడు ఫ్లైయింగ్ కారు అనేది కల. ఇప్పుడు నిజం. భవిష్యత్తులో ఫ్లైయింగ్ కార్ల ట్రాఫిక్ ని మనం చూస్తాం. మరి తాజా కారు ప్రత్యేకతలేంటో, లైసెన్సుల సంగతులేంటో తెలుసుకుందాం.

Samayam Telugu 27 Jan 2022, 9:46 am
కారులోనైనా, విమానంలోనైనా ప్రయాణం హాయిగానే ఉంటుంది. విమానంలా మారిపోగల కారులో ప్రయాణిస్తే... ఇక ఆ థ్రిల్ మామూలుగా ఉండదు. రోడ్డుపై కారులో వెళ్తూ... కావాల్సిన చోట విమానంలా ఎగిరిపోవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో 10 దాకా ఫ్లైయింగ్ కార్లు ఉన్నాయి. ఐతే... వాటికి ఎలాంటి లైసెన్స్ ఉండాలి... వాటిని డ్రైవ్ చేసే వాళ్లకు ఎలాంటి లైసెన్సులు ఉండాలి అనేది అసలు సమస్యగా మారింది (hybrid car aircraft video).
Samayam Telugu ఎయిర్ కార్ (image credit - youtube -  KleinVision)


తాజాగా యూరప్ లోని స్లొవేకియాలో ఓ ఫ్లైయింగ్ కారు (AirCar video)... ఎగిరేందుకు కావాల్సిన అర్హతలను పొందింది. ఈ కారు 2 నిమిషాల 15 సెకండ్లలో... విమానంలా మారిపోగలదు. దీన్ని 70 గంటలకు పైగా గాలిలో నడిపారు. ఈ సమయంలో ఈ కారు దేశవ్యాప్తంగా 200 చోట్ల ల్యాండ్ అయ్యి... తిరిగి టేకాఫ్ అయ్యింది. ఈ ఫ్లైట్ టెస్టులో కారు పాసైంది (flying car video).

ఈ కారును క్లెయిన్ విజన్ (Klein Vision) కంపెనీ తయారుచేసింది. దీనికి స్లొవేకియా ట్రాన్స్ పోర్ట్ అథార్టీ వారు... ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్ (airworthiness certificate) ఇచ్చారు. ఈ సర్టిఫికెట్ కారణంగా... ఈ కార్లను భారీగా ఉత్పత్తి చేసేందుకు వీలవ్వనుంది.

పైలట్ లైసెన్స్ తప్పనిసరి:
కారుకి ఎగిరే అర్హత ఉన్నా... దీన్ని డ్రైవ్ చేయడానికి అందరికీ పర్మిషన్ లేదు. దీన్ని డ్రైవ్ చేసేవారికి తప్పనిసరిగా పైలట్ లైసెన్స్ ఉండి తీరాలి. విమానం, హెలికాప్టర్లు నడిపేవారికి ఇలాంటి లైసెన్స్ ఉంటుంది. సాధారణ కార్లకు ఉండే ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే ఉన్న వారు ఈ కారును నడిపేందుకు పర్మిషన్ లేదు.

ఎయిర్‌కార్ కారు వీడియోని ఇక్కడ చూడండి (viral video)

అదిరిపోయే ప్రత్యేకతలు:
ఈ కారు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో గాలిలో వెళ్తుంది. ఇది భూమికి 8,000 అడుగుల ఎత్తులో ఎగరగలదు. దీనికి BMW ఇంజిన్ సెట్ చేశారు. అందువల్ల ఈ కారు చక్కగా దూసుకుపోయింది. ఈ కారు డిజైన్ ఇంత చక్కగా ఉండటానికి ప్రధాన కారణం 8 మంది స్పెషలిస్టులు అనీ... వారు దాదాపు లక్ష గంటలు పనిచేసి.. దీన్ని తయారుచేశారని క్లెయిన్ విజన్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు ఆంటోన్ జజాక్ తెలిపారు. ఈ కారు గ్యాస్ స్టేషన్లలో అమ్మే ఫ్యూయల్ తోనే వెళ్తుందని వివరించారు.

viral video: గంటకు 417 కి.మీ. వేగం... దూసుకెళ్లిన బుగాటీ...
నెక్ట్స్ ఏంటి?ఎగిరే పర్మిషన్ వచ్చేసింది కాబట్టి... క్లెయిన్ విజన్ కంపెనీ... ఈ కారును లండన్ నుంచి ప్యారిస్ కి ఎగిరించేందుకు రెడీ అవుతోంది. గతేడాది జూన్ లో స్లొవేకియాలోని నిత్రా, బ్రటిస్లావాలోని ఎయిర్ పోర్టుల మధ్య ఈ కారు 35 నిమిషాలు ఎగిరింది. రన్ వే పై దిగాక... ఇది కారులా మారింది. ఆ తర్వాత కూడా చాలాసార్లు దీన్ని విజయవంతంగా ఎగరేశారు. ఈ కారుకు లైసెన్స్ రావడం వల్ల... మిగతా కార్ల తయారీ కంపెనీలు కూడా తమ ఫ్లైయింగ్ కార్లకు లైసెన్స్ పొందేందుకు మరింత జోరుగా ప్రయత్నించే అవకాశాలున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.