యాప్నగరం

Love In World cup: ప్రేమ ‘విజయం’.. భారత్-పాక్ మ్యాచ్‌లో పెళ్లి ప్రపోజల్, వీడియో వైరల్!

ఇండియా - పాక్ మ్యాచ్‌లో ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌కు పెళ్లి ప్రపోజల్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మీరూ చూడండి మరి.

Samayam Telugu 22 Jun 2019, 8:55 pm
టీవల జరిగిన ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. క్రికెట్ మైదానంలో ఇండియా.. పాకిస్థాన్‌పై విజయం సాధించిన వేళ.. ప్రేక్షకుల గ్యాలరీలో ఓ యువకుడు పెళ్లి ప్రపోజల్ చేసి తన ప్రియురాలి హృదయాన్ని గెలుచుకున్నాడు. ఆమె చేతికి రింగు తొడిగి తన ‘మ్యాచ్’ సెట్ చేసుకున్నాడు.
Samayam Telugu త1


ఇటీవల మంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫార్డ్‌ క్రికెట్ మైదానంలో ఇండియా-పాక్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించి భారత అభిమానుల్లో ఆనందం నింపింది. ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో ప్రేక్షకుల గ్యాలరీలో కుర్చున్న విక్కీ అనే యువకుడు తన ప్రియురాలి అన్వితాకు ఉంగరాన్ని చూపించి ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా’’ అని అడిగాడు. దీంతో ఆశ్చర్యపోయిన ఆమె అతడికి ‘ఒకే’ చెప్పడమే కాదు. గట్టిగా హత్తుకుని ముద్దుల వర్షం కురిపించింది. అక్కడే ఉన్న వారి స్నేహితులు ‘వెల్ డన్ విక్కీ’ అంటూ వారిని మరింత ఉత్సాహపరిచారు.
ఈ వీడియోను అన్వితానే స్వయంగా ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దీన్ని 2,300 మంది రిట్వీట్ చేసుకోగా.. 8,117 మంది లైక్ చేశారు. 24 గంటల వ్యవధిలో లక్ష మందికి పైగా నెటిజనులు ఈ వీడియోను వీక్షించారు. వరల్డ్ కప్‌లో.. అదీ ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్‌లో ప్రపోజ్ చేయడం కంటే మంచి సందర్భం ఏముంటుంది చెప్పండి. ఆ మధుర క్షణాలు వారికి జీవితాంతం గుర్తిండిపోతాయి కదూ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.