యాప్నగరం

అమెరికా కేపిటల్ అల్లర్లలో.. మన జాతీయ జెండా, వీడియో వైరల్

అమెరికాలో జరుగుతున్న కాపిటల్ ఆందోళనల్లో కొందరు భారత జాతీయ జెండాను ప్రదర్శించడం చర్చనీయంగా మారింది. ఆ వీడియో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

Samayam Telugu 8 Jan 2021, 4:29 pm
మెరికాలోని వాషింగ్టన్ డీసీలో చెలరేగిన హింసను యావత్ ప్రపంచ లీడర్లు ఖండిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా అల్లర్లు మంచిది కాదని వెల్లడించారు. ప్రస్తుతం ఇంకా అక్కడ అవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. త్వరలో పదవి నుంచి తప్పుకోనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దుతుదారులు కేపిటల్‌లో పెద్ద ఎత్తున చేపట్టిన నిరసనల్లో ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలతో బాధపడుతున్నారు.
Samayam Telugu Image Credit: Twitter/ Alejandro Alvarez

రోజులో ఒక్కసారే టాయిలెట్‌కు వెళ్లాలి.. మించితే జరిమానా, ఉద్యోగులకు కొత్త రూల్!అయితే, ఈ ఆందోళనలో ట్రంప్‌కు మద్దతు తెలుపుతూ నిరసనకారులు అమెరికా జాతీయ జెండాలతో ఆందోళనకు దిగారు. మరికొందరు ట్రంప్ పేరుతో తయారు చేసుకున్నన జెండాలను ప్రదర్శించారు. అయితే, ఈ జెండాల మధ్య భారతీయ జాతీయ జెండా కూడా ఉండటం చర్చకు దారి తీసింది. బీజేపీ నాయకుడు వరుణ్ గాంధీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా లేవనెత్తారు. శివసేన నేత ప్రియాంక చతుర్వేది సైతం ఆ నిరసనల్లో మన జాతీయ జెండాను ప్రదర్శించడం తగదని వెల్లడించారు. అయితే, మన జెండాను నిరసనల్లో ఉపయోగించిన వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

వీడియో:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.