యాప్నగరం

వావ్.. ‘ఐరన్ మ్యాన్’ సూట్ తయారు చేసిన ఇండియన్, జోకులు పేలుస్తున్న నెటిజన్స్

ఐరన్ మ్యాన్ సూట్ తయారు చేయడం అంటే మాటలు కాదు. కానీ, ఓ భారతీయుడు దాన్ని తయారు చేశాడు. అది ఎలా పనిచేస్తుందో కూడా చేసి చూపించాడు. ఆ వీడియోను ఇక్కడ చూడండి.

Samayam Telugu 28 Oct 2019, 6:22 pm
‘ఐరన్ మ్యాన్’ హాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని సినిమా ఇది. ఇందులోని టోనీ స్టార్క్ పాత్ర ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ‘అవేంజర్స్’లో కీలక సభ్యుడిగా పోరాటాలు చేసే టోనీ ‘ఐరన్ మ్యాన్’ సూట్‌‌తో చేసే పోరాటాలు భలే ఆకట్టుకుంటాయి.
Samayam Telugu Photo Credit: 1st Image from Iron Man Poster, 2nd Image Grabbed From RT twitter Video
Photo Credit: 1st Image from Iron Man Poster, 2nd Image Grabbed From RT twitter Video


Also Read: టిండర్ యాప్‌లో 83 ఏళ్ల బామ్మ.. 50 మంది పైగా కుర్రాళ్లతో డేటింగ్!

ఇప్పుడు ఇలాంటి సూట్‌నే ఇండియాకు చెందిన ఓ వ్యక్తి రూపొందించాడు. అయితే, దాన్ని ‘ఐరన్ మ్యాన్’ సూట్‌తో పోల్చడం కష్టమే. ఎందుకంటే.. అతడు తనకు ఉన్న బడ్జెట్‌తో.. ఐరన్ మ్యాన్ స్ఫూర్తితో దాన్ని రూపొందించాడు. దాన్ని సైనిక అవసరాలకు ఉపయోగించాలనే మంచి ఉద్దేశంతో రూపొందించాడు.

ఇది ప్రారంభ దశ కాబట్టి.. ఆ డిజైన్ నవ్వు తెప్పించవచ్చు. ఎందుకంటే.. పెద్ద ఆవిష్కరణలు కూడా మొదట్లో చూసినప్పుడు విడ్డూరంగా, ఫన్నీగా కనిపిస్తుంటాయి. అయితే, సోషల్ మీడియాలో అంత గొప్పగా ఆలోచించేవాళ్లు కొందరే ఉంటారు.

Also Read: వక్షోజాల మధ్య రహస్య కెమేరా పెట్టుకుని మహిళ షికారు, చివర్లో ట్విస్ట్ అదుర్స్!

RT అనే వార్తా సంస్థ ఇటీవల ఈ ఇండియన్ ఐరన్ మ్యాన్ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. లోహంతో రూపొందించిన ఆ సూట్‌కు గన్స్ కూడా ఉన్నాయి. అవి ఎలా పనిచేస్తాయనేది ఆ వ్యక్తి వీడియోలో చూపించాడు. మధ్యలో ఊడిపోయిన బ్యాటరీ వైర్లను కలపడం కూడా కనిపించింది. ఈ వీడియోను ఇప్పటివరకు 3.73 లక్షల మంది వీక్షించారు.

వీడియో:

అయితే, అతడి సూట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు అతడి ప్రయత్నాన్ని మెచ్చుకుంటుంటే, ఇంకొందరు ఎగతాళి చేస్తున్నారు. ఎవరు ఏమంటున్నారనేది ఈ కింది ట్వీట్లలో చూడండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.