యాప్నగరం

నిద్రపోతూ నెలకు రూ.26 లక్షలు సంపాదిస్తున్నాడు.. చిత్రంగా లేదూ..

కొత్త కొత్త ఆలోచనలతో డబ్బు సంపాదిస్తూ ఈమధ్య కొంతమంది ఆకర్షిస్తున్నారు. ఆస్ట్రేలియాకి చెందిన ఓ టిక్ టాక్ యూజర్.. నిద్రపోతూ డబ్బు సంపాదిస్తున్నాడు. అది కూడా మామూలుగా కాదు... లక్షలు సంపాదిస్తున్నాడు. ఎలా అనేది ఆసక్తికరమైన విషయం. చాలా ఈజీగానే డబ్బు వస్తోంది. మనం కూడా అలా చేస్తే ఎలా ఉంటుంది అని నెటిజన్లు అనుకునేలా ఉంది అతని జీవన శైలి. కొత్తగా ఆలోచించి అమల్లోకి తేవడం వల్లే అతను సక్సె్స్ అయినట్లు కనిపిస్తోంది. మరి అతని ప్లానేంటి? ఎలా సంపాదిస్తున్నాడు?

Authored byKrishna Kumar | Samayam Telugu 30 Jun 2022, 10:31 am
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అయిన జాకీ బోమ్ (Jakey Boehm) తాను నిద్రపోతూ నెలకు రూ.26 లక్షల చొప్పున సంపాదిస్తున్నట్లు తెలిపాడు. ఎలాగంటే అతను నిద్రపోతున్న సమయంలో.. ఎవరైనా సరే అతన్ని నిద్రలేపవచ్చు. అలా లేపినందుకు డబ్బు ఇవ్వాలి. ఇలా ప్రపంచంలో ఎక్కడెక్కడి వారో అతన్ని డిస్టర్బ్ చేస్తూ... డబ్బు ఇస్తున్నారు. ఈ టెక్నికల్ ప్లాన్ కోసం జాకీ.. తన బెడ్‌రూంలో లేజర్లు, స్పీకర్లు, బబుల్ మెషిన్, అలారం ఇంకా చాలా వాటిని ఉంచాడు. ఇలాంటివి ఉంటే ఎవరికైనా నిద్ర సరిగా పట్టదు. ఇదే అతని ప్లాన్. (how to earn money)
Samayam Telugu నిద్రపోతూ నెలకు రూ.26 లక్షలు సంపాదిస్తున్నాడు (image credit - pixabay)
నిద్రపోతూ నెలకు రూ.26 లక్షలు సంపాదిస్తున్నాడు (image credit - pixabay)


జాకీ రోజూ రాత్రి 11 తర్వాత నిద్రపోతాడు. అప్పటి నుంచి లైవ్ స్ట్రీమ్ మొదలవుతుంది. ప్రపంచంలో ఎవరైనా సరే లైవ్ చూడవచ్చు. అతన్ని నిద్రలేపాలి అనుకుంటే.. అతను ఉంచిన వస్తువుల్ని పనిచేయించాలి. అవి పనిచేయడం మొదలుపెట్టగానే... ఆ గోల వల్ల జాకీకి మెలకువ వచ్చేస్తుంది. (Earn money with sleep)

జాకీ ఉంచిన అలారాన్ని మోగించేటప్పుడు యూజర్లకు కొన్ని సాంగ్స్ ఆప్షన్ ఇచ్చాడు. వాటిలో ఏదో ఒక సాంగ్ ద్వారా అలారాన్ని మోగించవచ్చు. అలాగే సాంగ్‌కి తగినట్లుగా లైట్ షోని కనెక్ట్ చెయ్యవచ్చు. ఆ అలారం, లైట్ల కాంతి వల్ల జాకీకి మెలకువ రాగలదు. (disturb sleep give money)

జాకీకి టిక్‌టాక్‌లో @jakeyboehm పేరుతో అకౌంట్ ఉంది. అందులో 5.2 లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. వాళ్లలో చాలా మంది రోజూ అతన్ని డిస్టర్బ్ చేస్తూ భారీగా డబ్బు ఇస్తున్నారు. ఓ టిక్ టాక్ వీడియో క్లిప్‌లో జాకీని ఎవరో రాత్రి 12.30కి నిద్రలేపారు. ఆ క్లిప్‌ని 70 లక్షల మందికి పైగా చూశారు. మరో వీడియో క్లిప్‌లో రాత్రి 2 గంటలకు గదిలోని స్పీకర్లు భారీగా డబ్‌స్టెప్ ట్యూన్స్‌ని ప్లే చేశాయి.

జాకీ గదిలో 20కి పైగా సౌండ్ ఎఫెక్టులు ఉన్నాయి. వాటిలో దేని ద్వారానైనా అతని నిద్రను చెడగొట్టవచ్చు. సౌండ్ అయినా, లైట్ అయినా ప్రతి 10 నుంచి 15 సెకండ్లకు ఓసారి యాక్టివ్‌ అవుతాయి. యాక్టివ్ అయినప్పుడు వాటిని యూజర్లు వాడుకోవచ్చు.
Loch Ness Monster: లోచ్ నెస్ రాక్షసి.. సమాంతర విశ్వంలో ఉందా?
28 ఏళ్ల జాకీకి రోజూ 7 గంటలు నిద్రపోవడం ఇష్టం. తనకు వస్తున్న డబ్బుతో అతను మరిన్ని సౌండ్ ఎఫెక్టులను కొని తన గదిలో సెట్ చేస్తానని తెలిపాడు. తద్వారా యూజర్లు మరింత ఎక్కువగా థ్రిల్ పొందవచ్చు అంటున్నారు. అంతా బాగానే ఉన్నా... ఇలా సరైన నిద్రలేకపోవడం వల్ల జాకీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీనిపై ఆందోళన ఉంది అన్న జాకీ... ప్రస్తుతానికి ఇలాగే కంటిన్యూ చేస్తున్నట్లు తెలిపాడు.
Time Traveller From 2096: కొత్త వైరస్ రాబోతోంది.. టైమ్ ట్రావెలర్ హెచ్చరిక!
జాకీ చేసేది సిల్లీ థింగ్ లాగా మనకు అనిపించవచ్చు. కానీ అదో క్రియేటివ్ ఐడియా. దీని వల్ల అతను భారీగా సంపాదిస్తున్నాడు. ఓ ఐడియా అతని జీవితాన్ని మార్చేసింది. అతన్ని ప్రపంచ సెలబ్రిటీగా చేసింది. ఇప్పుడు గూగుల్ సెర్చ్‌లో కూడా ఇలాంటి ఐడియాని అమలు చేస్తున్న ఏకైక వ్యక్తిగా అతను ఉన్నాడు. అతనికి సోషల్ మీడియా ద్వారా వస్తున్న ప్రచారం వల్ల రోజురోజుకూ వస్తున్న డబ్బు పెరుగుతూ ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.