యాప్నగరం

నేడు సంకేత భాషా దినోత్సవం.. ఆ భాషలకు అర్థాలే వేరు!

International Sign Languages day 2021: ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న జరుపుకునే సంకేత భాషా దినోత్సవం ప్రత్యేకతలు తెలుసుకుందాం.

Samayam Telugu 23 Sep 2021, 9:21 am
International Sign Languages day 2021: మనం ఎవరికైనా విషయం చెప్పాలంటే భాషతోపాటూ... మాట్లాడాలి. అలాగే వినగలగాలి. మరి బధిరుల పరిస్థితేంటి... వారు మాట్లాడలేరు, వినలేరు. అందువల్ల వారికి సమాచారం అందించేందుకు పుట్టినదే సంకేత భాష (sign language). ప్రపంచవ్యాప్తంగా చాలా సంకేత భాషలున్నాయి. వాటిని ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ... వాటిపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23ను అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దివ్యాంగులు (చెవిటివారు) కూడా అన్ని విషయాలూ తెలుసుకోవాలి. అది వారి హక్కు.. అంటూ ఐక్యరాజ్యసమితి (United Nations) సంకేత భాషలను ప్రోత్సహిస్తోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం (image credit - pixabay - ollis_picture)


సంకేత భాష చరిత్ర:
1951లో ప్రపంచ బధిరుల సంఘం (World Federation of the Deaf (WFD)) సెప్టెంబర్ 23న ఏర్పడింది. అందువల్ల ఏటా అదే రోజున ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఐతే... ఆ సంఘం ఏర్పడిన చాలా దశాబ్దాల తర్వాత 2018లో తొలిసారి ఈ ఉత్సవాన్ని జరిపారు. అప్పటి నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ బధిరుల వారోత్సవంలో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నారు.

7 కోట్ల మంది:
ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మందికిపైగా బధిరులు (deaf people) ఉన్నారు. వారు 300కు పైగా సంకేత భాషల్ని (sign languages) వాడుతున్నారు. కొన్ని న్యూస్ ఛానెళ్లు కూడా బధిరుల కోసం ప్రత్యేక బులిటెన్లు ఇస్తున్నాయి.

International Day of Sign Languages 2021 theme:
"మానవ హక్కుల కోసం మేం సంకేతం ఇస్తాం (We Sign For Human Rights)" అనేది ఈ సంవత్సరం థీమ్‌గా ప్రపంచ బధిరుల సంఘం ప్రకటించింది. ఈ సందర్భంగా బధితులు, వినగలిగేవారూ అందరూ కలిసి... బధిరుల జీవితాలు మెరుగయ్యేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అలాగే బధిరుల హక్కుల కోసం పోరాడాల్సి ఉంటుంది.

Sign language facts:
సంకేత భాషలో చేతులు, చేతి వేళ్లతోపాటూ కళ్లు ముఖ కవళికలు, శరీర హావభావాలు కూడా కీలకం. కనుబొమ్మలను కదపడం ద్వారా ప్రశ్నలు వేస్తారు. అవును, కాదు అనే సమాధానాలకు కనుబొమ్మల్ని ఉపయోగిస్తారు.

కారులో ఎలుగుబంటి.. వైరల్ వీడియో.. 47 లక్షల వ్యూస్

బ్రెయిన్ దెబ్బతిన్న వారు కూడా సంకేత భాష ద్వారా తమ అభిప్రాయాలను చెప్పగలరు. ఐతే... వారు సరైన క్రమంలో వాటిని చెప్పలేరు.

అమెరికా సైన్ లాంగ్వేజ్‌ (ASL)లో ఇంగ్లీష్ అక్షరాలను ఒకే చేత్తో చూపించగలరు. అదే బ్రిటన్ సైన్ లాంగ్వేజ్‌లో రెండు చేతులూ వాడుతారు.

ASLలో భార్య, కూతురు వంటి మహిళలకు సంబంధించిన విషయాలు చెప్పేందుకు సంకేతాలను దవడ దగ్గర నుంచి చెబుతారు. అదే తండ్రి, పిల్లాడు వంటి పురుషుల గురించి చెప్పేటప్పుడు నుదుటి దగ్గర నుంచి సంకేతాలను చూపిస్తారు.

ఈ కోడే కాదు.. మాంసం, ఎముకలు అన్నీ నలుపే!

చెవిటి వారు వ్యక్తుల పేర్లకు ప్రత్యేక సంకేతాలను వాడుతారు. ఫలితంగా వారు పూర్తి పేరును చూపించకుండానే ఆ పేరు ఏంటన్నది బధిరులకు అర్థమవుతుంది. ఈసారి మీరు ఎవరైనా బధిరులను కలిస్తే... మీ పేరును ఏ సంకేతాలతో చూపించవచ్చో తెలపండి.

ప్రతి సంకేతంలో ఐదు అంశాలుంటాయి. వాటిలో ఒక్కటి మారినా... మొత్తం అర్థం మారిపోతుంది. చేతి కదలికలో వచ్చే చిన్న తేడా కూడా మొత్తం అర్థాన్ని మార్చగలదు.

ఒకే చేతి నుంచి వచ్చే రెండు ఒకే రకమైన సంకేతాలకు కూడా అంశాలను బట్టి అర్థం వేరే ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.