యాప్నగరం

డ్రైవింగ్ చేస్తుండగా తండ్రికి హార్ట్ అటాక్.. పదేళ్ల కుర్రాడి సమయస్ఫూర్తి.. కానీ!

డ్రైవింగ్ చేస్తుండగా తన తండ్రికి హార్ట్ అటాక్ రావడంతో పదేళ్ల కుమారుడు వెంటనే సమయస్ఫూర్తితో స్పందించాడు.

Samayam Telugu 3 May 2019, 7:49 pm
కర్ణాటకలోని హులియారుకు చెందిన శివకుమార్ ప్రెషర్ కుక్కర్ల వ్యాపారం చేస్తుంటాడు. ఊళ్లోని షాపులకు ఆయన ప్రెషర్ కుక్కర్లను అందజేస్తుంటాడు. మే 1న మధ్యాహ్నం సమయంలోనూ ఇలాగే ఓ షాపు వాళ్లకు ప్రెషర్ కుక్కర్లు అందజేయడానికి కార్లో వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ.. తనతోపాటు పదేళ్ల తన కుమారుడైన పునీర్త్‌ను తీసుకెళ్లాడు. షాప్ దగ్గరకు చేరుకుంటున్నాం అనగా.. డ్రైవింగ్ సీట్లో ఉన్న అతడికి హార్ట్ అటాక్ వచ్చింది. దీంతో డ్రైవింగ్ చేస్తూనే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తన తండ్రికి ఏమవుతుందో ఆ పిల్లాడికి అర్థం కాలేదు.
Samayam Telugu cardiac arrest


కారు అదుపు తప్పుతూ యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉండటంతో ఆ కుర్రాడు వెంటనే స్పందించాడు. వెంటనే స్టీరింగ్ పట్టుకొని కారును నియంత్రించాడు. దీంతో కారుకి యాక్సిడెంట్ తప్పింది. కానీ హార్ట్ అటాక్ కారణంగా శివకుమార్ ప్రాణాలు వదిలాడు.

పదేళ్ల పునీర్త్ సమయస్ఫూర్తిని హులియారు ఎస్సై లక్ష్మీకాంత్ ప్రశంసించారు. పోస్ట్‌మార్టం తర్వాత శివకుమార్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.