యాప్నగరం

భలే.. కిడ్నాప్ చేసిన 7 నిమిషాల్లోనే దొరికిపోయారు, అంతా ట్రాఫిక్ మాయ!

‘బ్రోచేవారెవరురా’ తరహాలో దొరికిపోయిన కిడ్నాపర్లు. ఒక్కోసారి ట్రాఫిక్ రద్దీ కూడా మేలు చేస్తుందండోయ్!

Samayam Telugu 21 Oct 2019, 6:23 pm
ట్రాఫిక్ నిలిచిపోతే తెగ తిట్టుకుంటాం. కానీ, ఆ ట్రాఫిక్ ఒక్కోసారి మేలు కూడా చేస్తుందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ‘బ్రోచేవారెవరురా’ సినిమా చూసినవారికి.. చివర్లో వచ్చే హీరోయిన్ కిడ్నాప్ సీన్ గుర్తుండే ఉంటుంది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న కిడ్నాపర్ కారు నుంచి ఆమె భలే తెలివిగా తప్పించుకుంటుంది. దాదాపు ఇలాంటి ఘటనే ఢిల్లీలో చోటుచేసుకుంది.
Samayam Telugu GettyImages-896019416


Read also: తల్లి కళ్ల ముందే పిల్లల తలలు నరికి.. టీవీ ఎత్తుకెళ్లారు!

ఢిల్లీలోని జనక్‌‌పురిలో కారు పార్క్ చేస్తున్న రిజ్వాల్(21)ను నలుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. దీంతో అతడి సోదరుడు వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. ఆ కారు మీద ‘హై ల్యాండర్’ అనే అక్షరాలు ఉన్నాయని తెలిపాడు. ఈ సమాచారం అందగానే పోలీసులు పరిసర ప్రాంతాల్లో కిడ్నాపర్ల కోసం జల్లెడ పట్టారు.

Read also: పబ్‌జీ కోసం టీనేజర్ ‘కిడ్నాప్’.. ఆ మెసేజ్‌తో గుట్టురట్టు చేసిన తల్లి!

జనక్‌పురి ప్రాంతంలో ట్రాఫిక్ నిత్యం రద్దీగా ఉంటాయి. దీంతో కిడ్నాపర్లు కూడా ఆ రద్దీలో చిక్కుకున్నారు. ఉత్తమ్ నగర్ సిగ్నల్ వద్దకు రాగానే పోలీసులు కిడ్నాపర్ల కారును గుర్తించారు. దుండగులను పట్టుకొనే ప్రయత్నం చేశారు. దీంతో వారు కారును, రిజ్వాల్‌ను వదిలిపెట్టి పరుగులు పెట్టారు. నలుగురిలో ఒకడు మాత్రమే పోలీసులకు చిక్కాడు. పోలీసులు బాధితుడిని విడిపించి, నిందితుల కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కిడ్నాపర్ పేరు రవి అని తెలిసింది. ట్రాఫిక్ జామ్ కాకపోతే.. రిజ్వాల్ ఈపాటికి ఏమయ్యేవాడో కదూ!!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.