యాప్నగరం

బెట్ కాశాడు.. బల్లిని తిన్నాడు, చివరికి పేగులు చిట్లి..

చేపలు, మాంసాన్ని పచ్చిగా తినే అలవాటు ఉన్న ఓ వ్యక్తి.. తన మిత్రులతో పందెం కాసి బల్లిని తిన్నాడు. చివరికి ఇన్ఫెక్షన్‌కు గురై ప్రాణాలు విడిచాడు.

Suresh Chelluboyina | Samayam Telugu 5 Jul 2019, 7:49 pm

ప్రధానాంశాలు:

  • డెవిడ్ డావెల్(34)కు ముగ్గురు చిన్నారులు, భార్య ఉన్నారు. స్నేహితులతో పందెం కాసి పచ్చి చేపలు, మాంసాన్ని తినడం డావెల్‌కు అలవాటు.
  • ఇటీవల తన ఇంట్లో పార్టీ ఇచ్చిన డావెల్.. స్నేహితులతో బెట్ కాశాడు. అత్యంత ప్రమాదకరమైన గెక్కో బల్లిని తిన్నాడు.
  • ఆ తర్వాతి రోజు నుంచి అతడి ఆరోగ్యం చెడిపోయింది.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu pexels-photo-2078845
ల్లిని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది దాన్ని తినడమంటే? కడుపులో తిప్పేస్తుంది కదూ. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా విషపూరిత బల్లిని తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. పది రోజులపాటు ఇన్ఫెక్షన్‌తో పోరాడి.. చివరికి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేనెలో చోటుచేసుకుంది.
డెవిడ్ డావెల్(34)కు ముగ్గురు చిన్నారులు, భార్య ఉన్నారు. స్నేహితులతో పందెం కాసి పచ్చి చేపలు, మాంసాన్ని తినడం డావెల్‌కు అలవాటు. ఇటీవల తన ఇంట్లో పార్టీ ఇచ్చిన డావెల్.. స్నేహితులతో బెట్ కాశాడు. అత్యంత ప్రమాదకరమైన గెక్కో బల్లిని తిన్నాడు. ఆ తర్వాతి రోజు నుంచి అతడి ఆరోగ్యం చెడిపోయింది.

బల్లిని తినడం వల్ల అతని కడుపులో సల్మోనెల్లా అనే ఇన్ఫెక్షన్, డయేరియా ఏర్పడింది. పది రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ తీవ్రమై కడుపులోని పేగులు చిట్లాయి. దీంతో ఆహారం ఊపిరితీత్తుల్లోకి చేరి డావెల్ చనిపోయాడు. బల్లులు విషపూరితమైనవి. అందుకే, అవి సంచరించే చోట తినే పదార్థాలపై మూతలు పెట్టాలని చెబుతారు. కాబట్టి.. ఇలాంటి ప్రమాదంలో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండండి.
Photo credit: Pixels.com/Jimmy Chan

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.