యాప్నగరం

వీడియో: పచ్చని మొక్కల్నీ పీకేశారు.. ఇస్లాంకు విరుద్ధమంట, నిజం ఏమిటంటే..

ప్రపంచమంతా మొక్కలు నాటే పనిలో నిమగ్నమైతే.. పాకిస్తాన్‌లోని ఓ వర్గం ఇదిగో ఇలా మొక్కలను పీకేసే కార్యక్రంలో బిజీగా ఉన్నారట.

Samayam Telugu 12 Aug 2020, 12:48 pm
చ్చని మొక్కలు ప్రగతి మెట్లు అన్నారు. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో మొక్కలను పెంచడం తప్పనిసరిగా మారింది. దీంతో ఇప్పుడు అంతా ‘గ్రీన్ ఛాలెంజ్’ ద్వారా మొక్కలు నాటడంపై అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ‘హరిత హారం’ పేరుతో ఏటా కోట్లాది మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టింది. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు.. కనుమరుగు అవుతున్న పచ్చదనానికి మళ్లీ జీవం పోసే ప్రయత్నంలో ఉన్నాయి. అయితే, పాకిస్తాన్‌లో మాత్రం.. సీన్ రివర్స్ అయ్యింది.
Samayam Telugu Image Credit: Twitter


ప్రపంచ దేశాల బాటలో నడుస్తూ.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల మొక్కలను నాటి పచ్చదనం పెంపొందించాలని పిలుపునిచ్చారు. అయితే, ఇది ఆ దేశంలోని ఓ వర్గానికి ఇది అస్సలు నచ్చలేదని, మొక్కలు నాటడం ఇస్లాంకు వ్యతిరేకమంటూ ఏకంగా మతానికి ముడిపెట్టారు. కొంతమంది యువకులను రంగంలోకి దింపి.. మొక్కలను పీకించేశారంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీరిని చూస్తే.. అడవి మనుషులే చాలా బెటర్ అనిపిస్తుందంటూ నెటిజనులు దుయ్యబట్టారు.

Read Also: ఆ కూర వద్దన్నాడని షుగర్ మొగుణ్ని చావగొట్టిన పెళ్లాం
పాకిస్తాన్ ఖైబర్ మండీ కాస్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరి తింగరి పనిని.. ఇస్లాం పెద్దలే తప్పుబడుతున్నారు. మొక్కలకు మతానికి సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే, వారు ఇస్లాం పేరుతో ఆ మొక్కలను పీకలేదని మరికొందరు అంటున్నారు. ఓ వ్యక్తి ఖాళీ స్థలంలో కొందరు మొక్కలు నాటారని, దీంతో అతడు యువకుల సాయంతో వాటిని పీకించాడని చెబుతున్నారు. ఇందులో నిజమెంటనేది పెరుమాళ్ళకెరుక.

Watch Also: వరదలో వరుడు.. పడవలో ఊరేగి మరీ పెళ్లి చేసుకున్నాడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.