యాప్నగరం

హోంమంత్రి రాజ్‌నాథ్‌పై మోదీ పోటీ.. లక్నో బరిలో అభినందన్!

హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ పోటీ చేస్తున్న లక్నోలో ‘మోదీ’ నుంచి పోటీ ఎదురుకానుంది. ఈ ప్రాంతం నుంచి అభినందన్ బరిలోకి దిగడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

Samayam Telugu 13 Apr 2019, 8:39 pm
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ పోటీ ఏమిటని అనుకుంటున్నారా? ఒకే పార్టీకి చెందిన ఈ ముఖ్య నేతలు ఒకరిపై ఒకరు పోటీ పడటం అసంభవం అనే కదా మీ భావన. అదే కరెక్ట్!! రాజ్‌నాథ్‌పై పోటీకి నిలిచిన ఆ వ్యక్తి పీఎం మోదీ కాదు.. అచ్చుగుద్దినట్లు మోదీలా కనిపించే అభినందన్ పాఠక్. లక్నో స్థానం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
Samayam Telugu Untit 122


అంతేకాదు.. అతను వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై కూడా బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా అభినందన్ మాట్లాడుతూ.. ‘‘ప్రజలు మంచి రోజులు (అచ్చే దిన్) కోసం మోదీని ఎన్నుకున్నారు. కానీ ఆయన అన్నివిధాలా విఫలమయ్యారు. ప్రజల అకౌంట్లో రూ.15 లక్షలు పడలేదు. పైగా నోట్ల రద్దు, జీఎస్టీలతో ప్రజల జీవితాలు అతలాకుతలం అయ్యాయి. ప్రజల్లో మోదీపై చాలా వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయన రూపంలో ఉన్నాననే కారణంతో కొన్ని ప్రాంతాల్లో నన్ను కొట్టారు కూడా’’ అని తెలిపారు.
అభినందన్ పాఠక్ లక్నోలోని మావియ్యా ప్రాంతంలో నివసిస్తున్నారు. 2014లో ఆయన మోదీకి ప్రచారం చేయడం ద్వారా బాగా పాపులర్ అయ్యారు. గతేడాది అక్టోబరులో ఆయన బీజేపీని వీడారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలంటూ ఆయన మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆయన ఈ ఎన్నికల్లో స్వతంత్రంగానే బరిలోకి దిగుతున్నారు. స్థానిక ప్రజల నుంచి సేకరించి రూ.25 వేలుతో ఆయన నామినేషన్ దాఖలు చేసిన ఆయన వారణాసిలోనూ ప్రధాని మోదీపై బరిలోకి దిగుతానని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.