యాప్నగరం

వీడియో: చెట్టు మీద పాము.. ఎగిరి క్యాచ్ పట్టిన ముగింస

ముంగిసలంటే పాములకు ఎందుకంత భయమో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

Samayam Telugu 9 Sep 2020, 1:47 pm
పాము.. ముంగిస ఎదురుపడితే మహా సంగ్రామమే. వాటి పోరులో చివరికి ఎవరు గెలుస్తారనేది అంత సులభంగా చెప్పలేం. అయితే, పాము కాటును తట్టుకొనే సామర్థ్యం ఉన్న ముంగిసదే ఎక్కువసార్లు పైచేయి అవుతుంది. తెలివైన ఎత్తులతో పామును ముప్పు తిప్పలు పెట్టి చంపేస్తుంది. ఇదిగో ఈ వీడియోలో ఉన్న ముంగిస కూడా అలాంటిదే.
Samayam Telugu Image: Twitter


చెట్టుకు వేలాడుతున్న పామును చూడగానే.. ఆ ముంగిస ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. చెట్టు మీద ఉన్న పాముకు.. తనకు మధ్య ఉన్న ఎత్తు, దూరాలను లెక్క వేసుకుని మరీ పైకి జంప్ చేసి పాము తలను లటుక్కున పట్టుకుంది. చెట్టు మీద నుంచి కిందకి లాగి.. పొదల్లోకి తీసుకెళ్లిపోయింది.

Read Also: 16 ఏళ్ల వయస్సు.. మాంసం ముద్దలా మారిన శరీరం, ఆమెను అలా చేసింది ఎవరు?

డీసీఎఫ్ వెస్ట్ నాసిక్ ట్వీట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంగిస చూసేందుకు పాము కంటే చిన్నగానే కనిపిస్తుంది. కానీ, వాటి కంటే బలమైనవి. అందుకే.. పాములు ముంగిసను చూడగానే భయపడతాయి. కానీ, పోరాటం మాత్రం ఆపవు. ముంగిస బలమైనదే కాకుండా తెలివైనది కూడా. వేటాడటంతో దాని తర్వాతే మరే జీవైనా. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

Read Also: హనుమంతుడి రియల్ ఫొటో.. ఇది క్లిక్ చేసిన వ్యక్తి ఎలా చనిపోయాడు? మిస్టరీ వీడిందిలా!

వీడియో:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.