యాప్నగరం

లైంగిక దాడిపై మహిళ తప్పుడు ఫిర్యాదు.. రూ.25 లక్షల జరిమానా!

తనని అసభ్యకరంగా తాకారంటూ మహిళ తప్పుడు ఫిర్యాదు.. రూ.25 లక్షల జరిమానాతో షాకిచ్చిన కోర్టు.

Samayam Telugu 28 Jan 2019, 8:43 pm
హిళల భద్రత కోసం రూపొందించిన చట్టాలను కొందరు తమ స్వార్థం కోసం ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో తెలిపేందుకు ఈ ఘటనే నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాకు చెందిన ఫీల్ గుడ్ ఇండియా కంపెనీకి, ముంబయికి చెందిన సపథ్ అండ్ కంపెనీకి ట్రేడ్‌మార్క్‌కు కోసం వివాదం నడుస్తోంది.
Samayam Telugu photo1


ఈ నేపథ్యంలో ఫీల్ గుడ్ ఇండియా కంపెనీ ప్రొప్రయిటర్ నేహా గంధీర్.. సపథ్ అండ్ కంపెనీ యజమానిపై లైంగిక ఆరోపణలు చేసింది. అతను తనని అసభ్యంగా తాకారాని పేర్కొంది. వాస్తవానికి అక్కడ జరిగింది వేరు. దగ్గు మందు‌కు సంబంధించిన ట్రేడ్ మార్క్ పేరుపై సపథ్.. ఫీల్‌గుడ్ సంస్థపై ఫిర్యాదు చేశాడు.

ఈ కేసుపై డిసెంబరు 21, 2018న విచారణ జరిపిన బొంబే హైకోర్టు ఫీల్ గుడ్ సంస్థ ఉత్పత్తులను సీజ్ చేయాలని ఆదేశిస్తూ కోర్టు రిసీవర్‌ను నియమించింది. 2019, జనవరి 4న కోర్టు రిజీవర్, సపథ్ కంపెనీ ప్రతినిధులు కంపెనీ ఉత్పత్తులను సీజ్ చేస్తున్న దృశ్యాలను వీడియో రికార్డు చేశారు. దీంతో నేహా కోర్ట్ రిసీవర్ ఫోన్ లాక్కొడానికి ప్రయత్నించింది. వెంటనే ఆ వీడియోలను డిలీట్ చేయాలని డిమాండ్ చేసింది. అందుకు అతడు అంగీకరించకపోవంతో లైంగిక దాడి చేసినట్లు ఫిర్యాదు చేసింది. వాస్తవాలు తెలుసుకున్న కోర్టు ఆమెను మందలిస్తూ.. నేహా గంధీర్, ఆమె భర్తపై రూ.25 లక్షల జరిమానా విధించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.