యాప్నగరం

పార్లమెంటులో ఎంపీ బిడ్డకు పాలుపట్టిన స్పీకర్, నెటిజన్స్ ఫిదా!

Speaker feeds baby | ఎంపీలనే కాదు.. పసిబిడ్డలను కూడా ఆర్డర్‌లో పెట్టగలనని ఆ స్పీకర్ నిరూపించారు. ఓ ఎంపీ బిడ్డను ఎత్తుకుని పాలు పట్టించి ఔరా అనిపించారు.

Samayam Telugu 21 Aug 2019, 9:13 pm
Samayam Telugu ECdzidpWsAAvFsD
యన దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి. అయితే, ఆయన ఏనాడూ అధికార దర్పం ప్రదర్శించలేదు. ఉన్నత స్థానంలో ఉన్నా.. సాధారణ పౌరుడిలాగానే వ్యవహరిస్తూ అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన మరెవ్వరో కాదు.. న్యూజిలాండ్ పార్లమెంట్ స్పీకర్ ట్రెవర్ మలార్డ్. తాజాగా ఆయన ఓ బిడ్డకు పాలు పట్టిస్తూ మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

ఎంపీ టామాటి కఫే బుధవారం తన నెలల బిడ్డతో పార్లమెంటుకు హజరయ్యారు. సభ సాగుతుండగా ఆ చిన్నారి ఆకలితో ఏడ్వడాన్ని స్పీకర్ చూశారు. దీంతో ఆ బిడ్డను తన దగ్గరకు తీసుకున్నారు. స్పీకర్‌ కుర్చీలో కూర్చోబెట్టుకుని బాటిల్‌తో పాలు పట్టారు. ఈ ఫొటోలను ఆయన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.
‘‘సాధారణంగా సభా బాధ్యతలు కలిగిన అధికారులు మాత్రమే స్పీకర్ స్థానంలో కూర్చుంటారు. అయితే.. ఈ రోజు ఓ ముఖ్యమైన వ్యక్తి (వీఐపీ) నాతో ఈ స్థానంలో కూర్చున్నారు. మీ కుటుంబంలో కొత్త సభ్యుడు చేరినందుకు శుభాకాంక్షలు టిమ్’’ అని ట్వీట్ చేశారు. ఈ ఫొటో క్షణాల్లో వైరల్‌గా మారింది. స్పీకర్ ఆ బిడ్డకు పాలు పట్టించి, లాలించడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.