యాప్నగరం

ఆ ఆసుపత్రిలో 9 మంది నర్సులు ఒకేసారి గర్భవతులయ్యారు!

ఆ ఆసుపత్రిలో నర్సులు ఒక్కసారే గర్భవతులయ్యారు. వారి డెలవరీ టైమ్ కూడా దాదాపు కొద్ది రోజుల తేడాలోనే ఉండటం విశేషం.

Samayam Telugu 26 Mar 2019, 8:13 pm
కరు కాదు.. ఇద్దరు కాదు ఆ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించే 9 మంది నర్సులు ఒకేసారి గర్భవతులయ్యారు. పైగా వారి డెలవరీ టైమ్ కూడా దాదాపు కొద్ది రోజుల తేడాలోనే ఉండటం గమనార్హం. అమెరికాలోని పోలాండ్‌లో ఉన్న మైనే మెడికల్ సెంటర్‌‌లో పనిచేస్తున్న ఆ తొమ్మిది మంది నర్సులు అందరినీ ఆశ్చర్యపరుస్తూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు.
Samayam Telugu 1553587285-Pregg


ఎరిన్ గ్రెనియర్ అనే నర్సు దీనిపై మాట్లాడుతూ.. ‘‘ఒకరి తర్వాత ఒకరం ‘నేను గర్భవతి అయ్యా’ అని చెప్పుకోవడం చాలా కొత్తగా అనిపించింది. బేబీ బంప్ (కడుపు)తో ఒకరినొకరు చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు మేం ఒకరికి ఒకరు సాయపడుతున్నాం. ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు కూడా మామ్మల్ని చూసి సంతోషపడుతున్నారు’’ అని తెలిపింది.

ఆసుపత్రే స్వయంగా నర్సులు తల్లులు కాబోతున్నారనే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించడం విశేషం. ‘‘మా ఆసుపత్రిలోని 9 మంది నర్సులు ఏప్రిల్ నుంచి జులై నెలల మధ్య బిడ్డలకు తల్లులు కాబోతున్నారు. కంగ్రాట్యులేషన్స్’’ అంటూ 8 మంది నర్సుల ఫొటోను పోస్ట్ చేసింది. ఏది ఏమైనా ఒకే ఆసుపత్రిలో కలిసి పనిచేసే నర్సులు ఒకరికి తెలియకుండా ఒకరు గర్భం దాల్చడం అరుదైన విషయమే కదూ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.