యాప్నగరం

వీడియో: అయ్యో పెద్దాయన.. వద్దంటే వరదలోకి వెళ్లాడు, చివరికి..

వరద నీటితో నిండిపోయిన వంతెన దాటేందుకు ప్రయత్నించిన ఓ పెద్దాయనకు ఎదురైన దయనీయ పరిస్థితి ఇది.

Samayam Telugu 14 Jun 2021, 10:38 pm
రద ప్రవాహాన్ని అంచనా వేయడం కష్టం. చిన్నదే కదా అని సాహసం చేస్తే.. అది ప్రాణాలనే హరించేస్తుంది. నాందేడ్‌లోని ముఖేడ్ ప్రాంతంలో ఓ వృద్ధుడు ఎవరి మాట వినకుండా వరద నీటిలోకి దిగాడు. వంతెన మీద నుంచి వేగంగా ప్రవహిస్తున్న నీటిలో నడుస్తూ అవతలి వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇంకో నాలుగు అడుగులు వేస్తే.. ఒడ్డుకు చేరతాడనగా అతడి కాళ్లు తడబడ్డాయి. అంతే.. అప్పటివరకు అదను కోసం ఎదురుచూసిన వరద.. అమాంతంగా ఆ పెద్దాయనను ఎత్తుకుపోయింది. ఇదంతా అక్కడే నిలుచున్న జనాలు.. అతడికి సాయం చేయడానికి బదులు.. వీడియోలు తీశారు. దీంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Samayam Telugu Image Credit: The News Revivers/YouTube


ఆ పెద్దాయన పేరు విట్టల్ మనే (65) అని తెలిసింది. వృద్ధాప్యం వల్ల ఆయన కర్ర సాయంతో నడుస్తున్నాడు. శనివారం (జూన్ 12న) ఇంటికి వెళ్లాలనే కంగారులో వంతెనపై ప్రవహిస్తున్న వరద నీటిని దాటేందుకు ప్రయత్నించాడు. అక్కడి జనం వద్దని వారిస్తున్నా ఆయన మాట వినలేదు. వరదను సరిగ్గా అంచనా వేయకుండానే దిగాడు. కర్ర సాయంతో అడుగులో అడుగు వేసుకుంటూ దాదాపు అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు.

కానీ, అక్కడ ప్రవాహ వేగంగా ఎక్కువగా ఉండటంతో తుళ్లి పడిపోయాడు. అవతలి వైపు ఉన్న జనం మానవహారంగా నిలిచి ఆ పెద్దాయని చేతిని అందుకుని ఉంటే సరిపోయేది. కానీ, అంతా తమ మొబైళ్లతో ఆ పెద్దాయన సాహసాన్ని రికార్డు చేసే పనిలో ఉన్నారు. దీంతో వారి కళ్ల ముందే పెద్దాయన నీటిలోకి కొట్టుకుపోయాడు. చివరికి.. ఆదివారం(జూన్ 13న) ఓ గ్రామంలోని చెరువు వద్ద శవమై తేలాడు. ఈ ఘటన స్థానికుల్లో తీరని విషాదం నింపింది. ఎవరైనా సాయం చేసి ఉంటే ఆ పెద్దాయన తప్పకుండా బతికేవాడని అంటున్నారు.

వీడియో: Don't Miss:

షాకింగ్.. విమానంలో ఆక్సిజన్ నిలిపేసి 238 ప్రయాణికుల హత్య?

షూటింగులో నటిని ఆవహించిన దెయ్యం.. మగాడి గొంతుతో హడలెత్తించింది, చివరికి..
వంతెన కింద మహిళ తల.. వేర్వేరు ప్రాంతాల్లో శరీర భాగాలు, హత్య మిస్టరీ వీడిందిలా..నటి రొమ్ములు కోసి.. శరీరాన్ని అడ్డంగా నరికి దారుణ హత్య, చంపింది ఎవరంటే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.