యాప్నగరం

Watch: విమానానికి అడ్డంగా వెళ్లి.. నడుం విరగొట్టుకున్నాడు!

విమానం టేకాఫ్ వీడియోను బాగా తీయాలనుకున్నాడు.. అలా అలా రన్‌వే పైకి వెళ్లాడు. ఆ తెలివ తక్కువ పనికి భారీ మూల్యమే చెల్లించుకున్నాడు.

Samayam Telugu 28 Jan 2019, 6:40 pm
టేకాఫ్ అవుతున్న విమానం వీడియో తీయాలనే ఉత్సాహం అతడి నడుం విరగొట్టింది. బ్రెజిల్‌లోని తుర్మాలినా పార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఓ వ్యక్తి రన్‌వేపై నుంచొని టేకాఫ్ అవుతున్న ఎరుపు రంగు ఎయిర్‌క్రాఫ్ట్‌కు వీడియో తీస్తున్నాడు.
Samayam Telugu Untitled


అయితే, తన మొబైల్‌లో వీడియో చూస్తూ రన్నింగ్‌లో విమానాన్ని సమీపించాడు. దీంతో విమానం రెక్క అతడి నడుముకు బలంగా తగిలింది. దీంతో అతడు కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో విమానం రెక్క కూడా పక్కకు వంగిపోయింది. అక్కడే ఉన్న బాధితుడి స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. నడుము వద్ద తీవ్రమైన గాయలైనట్లు వైద్యులు ఈ సందర్భంగా తెలిపారు. ఆ విమానం యుఫ్రోసియో స్థానిక వ్యాపారవేత్తదని తెలిసింది. ప్రమాదం తర్వాత ఆ విమానం కొద్ది దూరం వెళ్లి ఆగిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.