యాప్నగరం

కోర్టు మెట్లు ఎక్కనున్న పందులు.. ‘పురుషత్వం’ కోసం పోరాటం

హక్కులు కేవలం మనుషులకేనా? మాకు ఉండవా అని ప్రశ్నిస్తున్నాయి పందులు. ఈ మేరకు కోర్టులో ఏకంగా దావా దాఖలు చేశాయి. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే.. ఈ పందుల బాధ తెలుసుకోవల్సిందే.

Samayam Telugu 17 Dec 2019, 4:47 pm
నుషులకేనా హక్కులు.. మాకు ఉండవా అంటూ పందులు కోర్టులో ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నాయి. మనుషులతో సమానంగా తమకు కూడా జంతు హక్కులు కల్పించాలని న్యాయమూర్తిని కోరనున్నాయి. అదేంటీ? పందులు ఎక్కడైనా కోర్టుకు వెళ్తాయా సిల్లీగా.. అనుకుంటున్నారా? కానీ, ఇది నిజం.. ఈ మూగ జీవుల తరఫున గళం వినిపించేది మరెవ్వరో కాదు.. పెటా(PETA).
Samayam Telugu Image by skeeze from Pixabay
Image by skeeze from Pixabay


పంది మాంసాన్ని వండినప్పుడు దుర్వాసన రాకుండా ఉండాలంటే.. యుక్త వయస్సులో ఉండే పందులకు కాస్ట్రేషన్ ద్వారా పురుషత్వాన్ని నాశనం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జర్మనీలోని పెటాకు చెందిన జంతు హక్కుల పోరాట సంఘం.. పందుల తరఫున కోర్టు దావా దాఖలు చేసింది. ‘‘మాకు కూడా హక్కులు ఉంటాయి. నొప్పి, బాధ, కోరికలు ఉంటాయి. యవ్వనంలో ఏదీ అనుభవించకుండానే మా పురుషత్వాన్ని నాశనం చేస్తున్నారు. కనీసం మత్తు కూడా ఇవ్వకుండా కాస్ట్రేషన్‌కు పాల్పడుతున్నారు. ఇకనైనా ఈ అరచకాలను ఆపండి’’ అని పందులు కోరుతున్నట్లు పేర్కొన్నారు.

Also Read: నదిలో వయాగ్రా.. ఆ నీళ్లు తాగి గొర్రెలు నిర్విరామ సెక్స్! వాస్తవం ఏమిటంటే..

‘‘జీవం లేని సంస్థలు, అసోషియేషన్లకే హక్కులు, చట్టాలను వర్తింపజేస్తున్నారు. అలాంటిది జంతువులకు ఎందుకు హక్కులు కల్పించడం లేదు?’’ అని పెటా తరఫు న్యాయవాది కార్నెలియా జిహ్మ్ ప్రశ్నించారు. ‘‘మత్తు ఇచ్చినా, ఇవ్వకపోయినా.. పందుల పురుషత్వం నాశనం చేయడయనేది హక్కులకు భంగం కలిగించడమే. దీన్ని ఆపాలంటే పందులే స్వయంగా కోర్టులో దావా వేసి తమ హక్కుల గురించి ప్రశ్నించడం ఒక్కటే మార్గం’’ అని పెటా ప్రతినిధులు తెలిపారు.

Also Read: ఆ బాతుకు సెక్స్ పిచ్చి.. రోజుకు 10 సార్లు అదే పని, చివరికి ఏమైందంటే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.