యాప్నగరం

మోటార్ సైకిల్ ఇంజిన్‌తో విమానం.. షాకిచ్చిన పోలీసులు

5వ తరగతి వరకు మాత్రమే చదివిన ఆ యువకుడు మోటార్ సైకిల్ ఇంజిన్‌తో విమానాన్ని తయారు చేశాడు. అయితే, దాన్ని పోలీసులు ఎత్తుకుపోయారు. ఎందుకో తెలుసా?

Samayam Telugu 25 Feb 2019, 6:37 pm
రాజస్థాన్‌కు చెందిన శివరాజ్ అనే 30 ఏళ్ల వ్యక్తి తన మేథస్సుకు పదునుపెట్టి మోటార్ సైకిల్ ఇంజిన్‌తో విమానాన్ని తయారు చేసిఅబ్బురపరిచాడు. 5వ తరగతి వరకు మాత్రమే చదివిన శివరాజ్ రేయింబవళ్లు కష్టపడి ఈ విమానాన్ని తయారు చేశాడు. దాన్ని అందరి ముందు ప్రయోగించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. శివరాజ్ తయారు చేసిన విమానాన్ని జప్తు చేశారు.
Samayam Telugu plane


ఈ విమాన ప్రయోగాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలంతా నాగదీ బాంద్‌లో గల శివరాజ్ దుకాణం వద్దకు చేరుకున్నారు. అయితే, స్థానిక పోలీసులు విమానాన్ని నడపనివ్వకుండా శివరాజ్‌ను అడ్డుకున్నారు. తమ అనుమతి లేకుండా ఈ ప్రయోగం చేపట్టకూడదంటూ విమానాన్ని జప్తు చేశారు.

రూ.40 లక్షల వ్యయంతో నిర్మాణం:
ఈ విమానం తయారీకి సుమారు రూ.40 లక్షలు ఖర్చు చేసినట్లు శివరాజ్ తెలిపాడు. ఓ బొమ్మను తయారు చేస్తున్న సమయంలో విమానాన్ని తయారు చేయాలనే ఆలోచన వచ్చిందన్నాడు. మోటార్ సైకిల్ ఇంజిన్‌కు 20 అడుగుల పొడవైన రెక్కలను అమర్చి విమానాన్ని తయారు చేశానని తెలిపాడు. ఇంధనం కోసం రెండు ప్లాస్టిక్ బాటిళ్లను అమర్చానన్నాడు. ఇద్దరు వ్యక్తులు కూర్చునేందుకు వీలుగా సీట్లను కూడా ఏర్పాటు చేశానన్నాడు. విమానానికి ముందు ఫ్యాన్ రెక్కలను అమర్చానని తెలిపాడు. అయితే, తన ప్రయత్నం ఇంతటితో ఆపబోనని, తప్పకుండా ఏదో ఒక రోజు తన విమానాన్ని విజయవంతంగా నడిపి తీరుతానని శివరాజ్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.