యాప్నగరం

Video: మనికే మాగే హితే.. బెల్లీ డాన్స్ చేసిన యువతి

Manike Mage Hithe: మనికే మాగే హితే పాటకు ఇప్పటికే వందల మందికి పైగా డాన్స్ వేశారు. వాటిలో కొందరి డాన్సులు నెటిజన్లను మెప్పిస్తున్నాయి. తాజాగా ప్రొఫెషనల్ బెల్లీ డాన్సర్ వేసిన బెల్లీ డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Samayam Telugu 25 Nov 2021, 11:07 am
Manike Mage Hithe: శ్రీలంక సాంగ్ మనికే మాగే హితే (In my Heart).. ఎంతలా దుమ్మురేపుతోందో రోజూ చూస్తూనే ఉన్నాం. తరచూ సోషల్ మీడియాలో ఈ పాటకు చాలా మంది తమదైన వాయిస్, ర్యాప్ టచ్ ఇస్తున్నారు. వేర్వేరు భాషల్లో దీన్ని వంద మందికి పైగా పాడారు. ఇక ఈ పాటకు డాన్సులు వేసే వారికి లెక్క లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది తమదైన స్టెప్స్‌తో అలరిస్తున్నారు. తాజాగా ప్రొఫెషనల్ బెల్లీ డాన్సరైన దీపాలీ వర్షిత... మనికే మాగే హితేకి... బెల్లీ స్టెప్స్ వేసి అలరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన వీడియో పాతది అయినా ఇప్పుడు దాన్ని ఎక్కువ మంది షేర్ చేసుకుంటున్నారు.
Samayam Telugu మనికే మాగే హితేకు బెల్లీ డాన్స్ (image credit - instagram - deepali_vashistha)


బెల్లీ డాన్సర్లు (belly dance) మ్యూజిక్, సాంగ్‌కి తగినట్లుగా నడుము ఊపుతూ... పర్ఫెక్ట్ కట్స్ ఇస్తారు. అలా ఇవ్వకపోతే... ఇక ఆ డాన్స్‌ వేసినా వేస్ట్. ఈ విషయంలో దీపాలీ వర్షిత రెండు స్టెప్స్ ఎక్కువే నేర్చుకుంది. చిత్రమేంటంటే... ఓవైపు బెల్లీ డాన్స్ చేస్తూ... మరోవైపు ఆమె రోబోలా కదులుతోంది. రోబో డాన్స్‌ని బెల్లీ డాన్స్‌కి మిక్స్ చేసింది. అందువల్ల ఈ వీడియో నెటిజన్లకు నచ్చుతోంది. (viral video)

ఆ వీడియో (viral song)ని ఇక్కడ చూడండి
View this post on Instagram A post shared by Deepali Vashistha (@deepali_vashistha)

దీపాలీ వర్షిత... ఇదే కాదు... ఇంకా చాలా సాంగ్స్‌కి బెల్లీ డాన్స్ వేసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో చాలా వీడియోలు పోస్ట్ చేసింది. ఆమెకు ప్రస్తుతం 71వేల మంది ఫాలోయర్లు ఉన్నారు.

ఇక శ్రీలంక మ్యుజీషియన్ యొహానీ దిలోకా ది సిల్వా (Yohani Diloka de Silva) పాడిన మనికే మాగే హితే వీడియోకి యూట్యూబ్‌ (youtube song)లో ఇప్పటివరకు 18.5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆమె క్విర్కీ మెలోడీ ట్యూన్‌కి క్యాచీ ఫోక్ రిథమ్ ఇవ్వగా... సతీషన్ రత్నయాకా... ర్యాప్ టచ్ ఇచ్చారు. ఈ పాటను ఇంగ్లీష్, హిందీ, తమిళం, మలయాళం, బంగ్లా, భోజ్‌పురి ఇతర విదేశీ భాషల్లో పాపులర్ ఆర్టిస్టులు దీన్ని అడాప్ట్ చేసుకున్నారు.


స్లో ట్యూన్‌కి బ్యాక్‌గ్రౌండ్ ట్రాక్ మ్యూజిక్ కూడా వినసొంపుగా ఉండటం వల్లే ఈ సాంగ్ ఇంతలా దుమ్మురేపుతున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.