యాప్నగరం

రగిలే నిప్పు కణిక భగత్ సింగ్.. ఈ స్ఫూర్తిదాయక సూక్తులను షేర్ చేసుకోండి

‘‘ఊగరా.. ఊగరా.. ఉరికంబమందుకుని ఊగరా.. ఊగితే శత్రువుకు దడదడ...’’ అంటూ నినదించిన విప్లవ వీరుడు, 23 ఏళ్లకే దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడు ఒకసారి స్మరించుకుందాం. ఆయన చెప్పిన ఈ సూక్తులను షేర్ చేసుకుందాం.

Samayam Telugu 23 Mar 2020, 12:11 pm
‘భగత్ సింగ్’.. ఈ పేరు వింటే చాలు భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. ఆయన ఆలోచనలు, ఆశయాలు, ఆవేశం ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకం. గొప్ప విప్లవకారుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయే ధీరుడు భగత్ సింగ్. సెప్టెంబర్ 28వ తేదీన జన్మించిన ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం... బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసి 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడాడు. 1931, మార్చి 23న రాత్రి 7.30 గంటలకి భగత్ సింగ్‌తోపాటు విప్లవకారులు సుఖ్ దేవ్, రాజ్ గురులను హుస్సైన్‌వాలా జైల్లో బ్రిటీష్ పాలకులు ఉరి తీశారు. ఉరి కంబం ఎదురుగా కనిపిస్తున్నా.. వారు అధైర్య పడలేదు. చిరునవ్వుతోనే మృత్యువును కౌగిలించుకుని.. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. అందుకే ఈ రోజును ‘షహీదీ దివాస్‌’గా భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్‌గురుల ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో భగత్ సింగ్ చెప్పిన కొన్ని స్ఫూర్తిదాయక సూక్తులను ఇక్కడ అందిస్తున్నాం. వీటిని కాపీ చేసుకుని మీ వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, హెలో తదితర సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేసి మీ దేశభక్తిని చాటండి.
Samayam Telugu భగత్ సింగ్
భగత్ సింగ్


‘‘విప్లవం కలహాలతో కలవలేదు. బాంబులు, తుపాకులు విప్లవం చేయలేవు. విప్లవం అనే కత్తికి మీ ఆలోచనలతో పదును పెట్టండి’’
- భగత్ సింగ్

‘‘నేను ఒక మనిషిని, మానవాళిని ప్రభావితం చేసేవన్నీ నాకు సంబంధించనవే’’
- భగత్ సింగ్

‘‘కనికరం లేని విమర్శలు, స్వతంత్ర ఆలోచనలు.. విప్లవానికి అవసరమైన రెండు విశిష్ట లక్షణాలు’’

‘‘మనుషులను చంపగలరేమో.. కానీ వారి ఆదర్శాలను చంపలేరు’’
- భగత్ సింగ్

‘‘జీవితాన్ని ప్రేమిస్తాం.. మరణాన్ని ప్రేమిస్తాం.. మేం మరణించి..
ఎర్రపూల వనంంలో పూలై పూస్తాం..
ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం..
నిప్పురవ్వల మీద నిదురిస్తాం’’
- భగత్ సింగ్

‘‘దేశం కోసం చనిపోయేవారు..
ఎల్లకాలం బతికే ఉంటారు’’
- భగత్ సింగ్

‘‘తిరుగుబాటు అనేది ఒక విప్లవం కాదు. అది చివరికి ముగింపునకు దారి తీయవచ్చు.’’
- భగత్ సింగ్

‘‘ప్రేమ ఎల్లప్పుడూ మనిషి పాత్రను ఉద్దరిస్తుంది. ఇది అతన్ని ఎప్పటికీ తగ్గించదు. ప్రేమ ఎప్పుడూ ప్రేమగానే ఉంటుంది‘‘.
- భగత్ సింగ్

‘‘వారు నన్ను చంపవచ్చు. కానీ వారు నా ఆలోచనలను చంపలేరు. వారు నా శరీరాన్ని దహించగలరు. నా ఆత్మను దహించలేరు’’
- భగత్ సింగ్

‘‘చెవిటి వారికి వినబడాలంటే శబ్దం చాలా బిగ్గరగా ఉండాలి’’
- భగత్ సింగ్

‘‘ప్రేమికులు, వెర్రివాళ్లు, కవులు ఒకే ముడిసరుకుతో తయారవుతారు’’
- భగత్ సింగ్

Also Read: ఆ నంది విగ్రహం పెరుగుతోంది.. రోమేనియా తరహాలోనే యాగంటిలో అద్భుతం, వీడిన మిస్టరీ!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.