ఎడారిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే సంగతి తెలిసిందే. ఎటు చూసినా ఇసుక మాత్రమే ఉండే సహారా ఎడారిలో పొరపాటున దారి తప్పితే.. ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవల్సిందే. కనుచూపు మేరలో.. ఎక్కడా నీటి చుక్క కూడా దొరకని ఆ ప్రాంతంలో ఒంటెలు, కొన్ని రకాల పాములు, జంతువులు మినహా మరే ప్రాణీ జీవించలేదు. మరి, అలాంటి ఎడారిలో మంచు వర్షం కురిస్తే.. హిమాలయాల తరహాలు స్వేత వర్ణం పులుముకుంటే? భలే చిత్రంగా ఉంటుంది కదూ!
సహారా ఏడారిలో ఇటీవల మైనస్ 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సందర్భంగా అల్జేరియాలోని ఎయిన్ సెఫ్రాలో మంచు వర్షం కురిసింది. కరీం బౌచేటాట అనే ఫొటోగ్రాఫర్ ఈ అరుదైన చిత్రాలను తన కెమేరాలో బంధించాడు. అనంతరం ఆ చిత్రాలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. చిత్రకారుడు గిసీన అందమైన చిత్రాల్లా.. ఇసుక మీద తెల్లని మంచు గీతలు భలే ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఆ చిత్రాలను చూస్తే మీరు కూడా ఈ లోకాన్ని మరిచిపోతారు. ఫొటోలను ఈ కింది ఇన్స్టాగ్రామ్లో చూడండి.