యాప్నగరం

శ్రీకృష్ణాష్టమి.. బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పండిలా

కృష్ణాష్టమి నేపథ్యంలో ఈ అందమైన.. ఆధ్యాత్మికమైన కోట్స్‌తో మీ బంధుమిత్రులు, ఆప్తులకు శుభాకాంక్షలు చెప్పండి.

Samayam Telugu 10 Aug 2020, 8:37 pm
సృష్టికర్త మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీ కృష్ణుడిగా ఎనిమిదో అవతారము ఎత్తారు. శ్రీ కృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడి కారాగారంలో జన్మించారు. ఆ పర్వదినాన్నే నేడు శ్రీ కృష్ణ జన్మాష్టమిగా లేదా గోకులాష్టమి, కృష్ణాష్టమిగా జరుపుతున్నారు. ఈ నెల 11న మంగళవారం రోజున జన్మాష్టమి నిర్వహించనున్నారు.
Samayam Telugu Image by Pexels from Pixabay


కృష్ణుడి జన్మ రహస్యం భగవద్గీతలోని 4-7 అధ్యాయాలలో పొందు పరచి ఉంది. ‘‘యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత! అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహమ్ !!’ అంటే ఓ భరత వంశీయుడా, అర్జునా, ధర్మం నశించి, అధర్మం పెచ్చు మీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను. అని భగవానుడు స్వయంగా తన పుట్టుక గురించి తెలియజేశాడు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ కృష్ణాష్టమి రోజున బంధువులు, మిత్రులకు ఇలా శుభాకాంక్షలు అందించి.. ఆ భగవంతుడి ఆశీర్వాదాలు వారికి చేరాలని కోరుకోండి.

మో భగవతే నందపుత్రాయ ఆనందవపుషే గోపీజనవల్లభాయ స్వాహా.. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
- శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
సుదేవ సుతం దేవం కంస చాణుర మర్ధనమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ...
- శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
హ్రీం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీం శ్రీం శ్రీ.. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
- శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
నందపుత్రాయ శ్యామలాంగాయ బాలవపుషే కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా... కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
- శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
మీకు, మీ కుటుంబానికి ఆ శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ..
- అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.