యాప్నగరం

ఫన్నీ వీడియో.. టీచర్‌కు బుడతడు స్వీట్ వార్నింగ్, వీడు చాలా స్పీడు!

ఈ పిల్లాడికి ధైర్యం చాలా ఎక్కువండోయ్. బోర్డు మీద రాసినది పలక మీద రాయమంటే.. టీచర్‌కు ఎలా వార్నింగ్ ఇచ్చాడో చూడండి.

Samayam Telugu 6 Jul 2019, 9:17 pm
తెలిసీ తెలియని వయస్సులో పిల్లలు భలే అల్లరి చేస్తారు. అంతేకాదు.. అమాయకంగా వారు చెప్పే మాటలు కూడా ముద్దొస్తాయి. కొంతమంది పిల్లలు ముదురు మాటలతో మొట్టికాయలు కూడా తింటారు. అయితే, ఆ మాటలను ఎప్పుడు తలచుకున్నా నవ్వొస్తాయి. ఇదిగో ఈ వీడియోలో ఉన్న బుడతడు కూడా ఆ కోవకు చెందినవాడే.
Samayam Telugu 1211


తరగతి గదిలో బోర్డు మీద రాసివున్న అక్షరాలను పలక మీద రాయమని టీచర్ చెబితే.. ఆమెకు ఘాటుగా సమాధానం చెప్పాడు. ఆమే అవన్నీ పలక మీద రాసి.. కింద తను రాసేందుకు చోటు ఉంచితే అప్పుడు రాస్తానని చెప్పాడు. దీంతో టీచర్.. నువ్వే బోర్డు మీద చూసి పలక మీద రాసుకోవాలని చెప్పింది. దీంతో ఆ పిల్లాడు టీచర్‌తో కాసేపు వాదనకు దిగాడు. చివరికి ఓపిక నశించిందో ఏమో.. టీచర్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఆమె వైపు కోపంగా చూస్తూ, పలకని బలపంతో కొడుతూ హీరో స్టైల్‌లో.. ‘‘ఖచ్చితంగా నువ్వే రాసి ఇవ్వాలి’’ అని హెచ్చరించాడు.

దుర్గాప్రసాద్ బండీ అనే వ్యక్తి ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దీంతో ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దీన్ని 2 వేల మందికి పైగా షేర్ చేసుకోగా.. 44 వేల మంది చూశారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ బుడతడి స్వీట్ వార్నింగ్ చూసి, నచ్చితే షేర్ చేసుకోండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.