యాప్నగరం

చీరలు విప్పి.. యువకులను కాపాడిన మహిళలు, కానీ..

కళ్ల ముందు పోతున్న ప్రాణాలను కాపాడేందుకు ఆ మహిళలు తమ గురించి ఆలోచించలేదు. వెంటనే తమ చీరలు విప్పి.. వారిని ఆదుకున్నారు. వారి మానవత్వానికి సెల్యూట్ చేసినా తక్కువే.

Samayam Telugu 11 Aug 2020, 5:15 pm
ళ్ల ముందు ప్రాణం పోతుంటే వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేసుకొనే రోజులివి. అయితే, ఆ మహిళలు మాత్రం అలా చేయలేదు. ఎలాగైనా సరే బాధితులను కాపాడాలని అనుకున్నారు. మానం కంటే ప్రాణం గొప్పదని భావించారు. వెంటనే తమ చీరలు విప్పి జలాశయంలో కొట్టుకుపోతున్న నలుగురు యువకులను కాపాడేందుకు ప్రయత్నించి మానవత్వం చాటారు. కానీ.. వారు ఇద్దరిని మాత్రమే ప్రాణాలతో ఒడ్డుకు చేర్చగలిగారు. మరో ఇద్దరు నీటిలో మునిగి చనిపోయారు.
Samayam Telugu Image by Free-Photos from Pixabay


12 మంది యువకులు తమిళనాడులోని పెరంబలూర్ జిల్లాలో కొట్టరాయ్ సమీపంలోని సిరువచ్చుర్ గ్రామంలో క్రికెట్ ఆడేందుకు వచ్చారు. ఆట ముగిసిన తర్వాత వీరంతా కొట్టరాయ్ జలాశయం వద్దకు చేరుకున్నారు. అక్కడ దుస్తులు ఉతికి ఇంటికి తిరిగి వెళ్తున్న ముగ్గురు మహిళలను డ్యామ్‌లో స్నానం చేయొచ్చా అని అడిగారు. వరదల వల్ల జలాశయంలో సుమారు 20 అడుగుల ఎత్తు వరకు నీరు చేరిందని, ఈ సమయంలో అందులోకి దిగితే ప్రమాదమని చెప్పారు.

Read Also: దెయ్యం పడితే.. ఇంత దారుణమైన మరణమా? ఆమె శరీరం ఛిద్రమైంది!

ఇంతలో ఇద్దరు యువకులు కాలు జారి డ్యామ్‌లో పడ్డారు. వారిని రక్షించేందుకు మరో ఇద్దరు నీళ్లలోకి దూకారు. అయితే, ఈత రాకపోవడం వల్ల సాయం కోసం కేకలు పెట్టారు. దీంతో ఆ మహిళలు.. మరో ఆలోచన లేకుండా తమ వంటి మీద ఉన్న చీరలను విప్పేశారు. నీటిలో మునిగిపోతున్న యువకుల వద్దకు విసిరారు. ఈ సందర్భంగా ఆ మహిళలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి నీటిలోకి దిగారు. ఆ చీరలను పట్టుకుని ఇద్దరు తీరానికి రాగలిగారు. దురదృష్టవశాత్తు మరో ఇద్దరు వారి కళ్ల ముందే నీటిలో మునిగి చనిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.