యాప్నగరం

video: 5 నిమిషాల్లో పాట రాశాడు.. ఐదున్నర కోట్ల వ్యూస్ సాధించాడు

అదిరిపోయే పదాలు, బద్ధలైపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్... ఇలా ఎన్నో చేసినా ఒక్కోసారి పాటలు హిట్ అవ్వవు. కానీ.. ఒక్కోసారి అనుకోకుండా అలా అలా రాసిన పాటలు అద్భుతమైన హిట్ ఇస్తాయి. అలా బీచ్‌లో చేపలు పట్టేందుకు వెళ్లిన BTS మెంబర్ జిన్ వెంట్... ఐదు నిమిషాల్లో రాసిన పాట... 3 నెలలుగా సూపర్ వ్యూస్ రాబడుతోంది. ఇప్పటికే 5న్నర కోట్ల మంది చూడటమే కాదు... దానిపై చాలా రీమిక్సులు, డబ్‌స్మాష్‌లూ వస్తున్నాయి. మరి అసలు ఆ పాట ఎలా పుట్టిందో, ఆ వీడియో సాంగ్ ఎలా ఉందో చూద్దాం.

Samayam Telugu 15 Mar 2022, 11:55 am
తూర్పు ఆసియా దేశాల్లో స్టేజ్ షోలపై డాన్స్ చేసే సింగర్లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ కొరియాలో ప్రత్యేక బ్యాండ్‌లు ఉంటాయి. ఆ బృందాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. వారి కాన్సర్టులకు జనం ఇరగబడి వస్తారు. అలాంటి వాటిలో బ్యాండ్ బంగ్స్తాన్ సోనియోండాన్ (BTS) ఒకటి. దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇందులోని ప్రతీ మెంబర్‌కీ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిలో ఒకడైన జిన్ వెంట్‌కి ప్రత్యేక ఫ్యాన్ ఆర్మీ ఉంది. జిన్ ఏం చేసినా ఆ ఆర్మీ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండింగ్ చేస్తుంది. (super tuna song)
Samayam Telugu సూపర్ ట్యూనా సాంగ్ (image credit - youtube -  BANGTANTV)


గత డిసెంబర్ 4న జిన్... యూట్యూబ్‌లోని BANGTANTV ఛానెల్‌లో 1.12 నిమిషాల వీడియో సాంగ్‌ని అప్‌లోడ్ చేశారు. ఇందులో జిన్... ఓ సముద్ర తీరంలో డాన్స్ వేస్తూ పాటపాడాడు. అతనికి తోడుగా మరో ఇద్దరు డాన్సర్లు జతకలిశారు. ఫుల్ జోష్‌తో సాగే పాట ఇది. అందువల్ల నెటిజన్లకు ఇది బాగా నచ్చింది. చాలా మంది దీన్ని ఓన్ చేసేసుకొని... రోజుల తరబడి పాడేసుకున్నారు. ఫలితంగా కొన్ని రోజుల్లోనే దీనికి లక్షల వ్యూస్ వచ్చాయి. అలా 3 నెలలు తిరిగేసరికి 5న్నర కోట్ల మందికి పైగా దీన్ని చూసేశారు. (super tuna song on youtube)

ఆ పాటను ఇక్కడ చూడండి (viral video)

చేపల వేటకు వెళ్లి పాట:
జిన్‌కి చేపల వేట అంటే ఇష్టం. అందుకే బీచ్‌కి వెళ్లాడు. అక్కడ ఓ పాట రాస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. సూపర్ ట్యూనా పేరుతో ఐదు నిమిషాల్లో రాసేశాడు. ఇప్పుడా పాటకు సూపర్ ట్యూనా ఛాలెంజ్ (Super Tuna challenge) పేరుతో చాలా రీమిక్సులూ, ఇమిటేషన్లూ, డబ్‌స్మాష్‌లూ వచ్చేశాయి. వాటిలో కొన్ని ఇక్కడ చూడండి
View this post on Instagram A post shared by CCDance (@ccdance_hk)

View this post on Instagram A post shared by jaz (@jazco.vers)

View this post on Instagram A post shared by worldwide handsome (@jinbase)

చూశారుగా మన తెలుగులో శ్రీవల్లీ, బెంగాల్‌లో కచ్చా బాదామ్ లాగానే.. సౌత్ కొరియా నుంచి ఈ సూపర్ ట్యూనా సాంగ్ కూడా నెటిజన్లకు బాగా నచ్చిందన్నమాట. "ఈ పాటను వినమని నా ఆర్మీని కోరాను. వాళ్లకు ఇది బాగా నచ్చింది. వాళ్లు దీన్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు. అది చాలు నాకు" అని జిన్ తెలిపాడు.
video: శిథిల భవనంలో పియానో వాయించింది.. ఉక్రెయిన్ హార్ట్ టచింగ్ వీడియో
BTSలో ఏడుగురు సభ్యులున్నారు. వారు RM, జిన్, జే-హోప్, సుగా, జిమిన్, వి, జంగ్ కుక్. ఈమధ్యే ఈ బ్యాండ్... సియోల్ ఒలింపిక్ స్టేడియంపై 3 రోజులపాటూ... స్టేజ్ డాన్స్ కాన్సర్ట్ నిర్వహించేందుకు పర్మిషన్ పొందింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.