యాప్నగరం

చేతుల్లేని ఈ చిన్నారి.. చేతిరాతలో ఛాంపియన్!

ఈమెకు చేతులు లేవు.. కానీ, అద్భుతమైన చేతి రాతతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పెయింటింగ్, చిత్రలేఖనంలోనూ ప్రతిభ చూపుతోంది.

Samayam Telugu 22 Apr 2019, 9:26 pm
చేతులు సక్రమంగా ఉన్నా.. అందమైన చేతి రాతను సొంతం చేసుకోవడమనేది గగనమే. అలాంటి ఆ చిన్నారికి పుట్టుక నుంచి చేతులు లేవు. కానీ, చేతి రాతలో మాత్రం ఆమెది అందేవేసిన ‘చేయి’. సారా హినెస్లే అనే 10 ఏళ్ల బాలిక ఇటీవల అమెరికాలో జరిగిన జాతీయ హ్యాండ్ వ్రైటింగ్ కాంపిటీషన్‌లో ఛాంపియన్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Samayam Telugu 1555936311-sara_hinesley_twitter


కేవలం చేతి రాతే కాదు.. ఈ చిన్నారి అందమైన పెయింటింగులు, చిత్రలేఖనాలు, శిల్పాలను కూడా తయారు చేయగలదు. ఇటీవల ఆమె ఇంగ్లీషులో కర్సీవ్ వ్రైటింగ్ కూడా నేర్చుకుంది. సారా ఫ్రెడెరిక్‌లో సెయింట్ జాన్స్ రీజనల్ క్యాథలిక్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది. చేతులు లేకపోవడం వల్ల రెండు చేతుల మణికట్టుతో పెన్సిల్ పట్టుకుని రాస్తోంది.
సారా కుటుంబం 2015లో చైనా నుంచి అమెరికాకు వలస వచ్చారు. దీంతో ఆమెకు మొదట్లో ఇంగ్లీషు వచ్చేది కాదు. దీంతో పట్టుదలతో ఇంగ్లీష్ నేర్చుకోవడమే కాకుండా చేతి రాతలో కూడా ప్రావీణ్యం సాధించడం విశేషం. ఈ పోటీలో విజయం సాధించినందుకు సారాకు రూ.35 వేలు నగదు బహుమతి లభించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.