యాప్నగరం

మహిళను కరోనా వైరస్ నుంచి కాపాడిన కుక్క, ఆ పిచ్చి పని చేయకపోతే..

తన పెంపుడు కుక్క చేసిన పని చూసి ఆ మహిళకు చిర్రెత్తుకొచ్చింది. కానీ, అదే ఆమెకు ఊహించని విధంగా వరమైంది. ఆమె ప్రాణాలను కాపాడింది.

Samayam Telugu 30 Jan 2020, 1:01 pm
కుక్కలు యజమానుల పట్ల ఎంత విశ్వాసంగా ఉంటాయో తెలిసిందే. వారికి ఏ ఆపద కలిగినా తన ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ రక్షిస్తాయి. అలాగే, కుక్కల వద్ద ఉన్న మరో వరం.. ప్రకృతి విపత్తులను సైతం ముందుగానే గుర్తించడం. అయితే, ఓ కుక్క ఊహించని విధంగా తన యజమానిని కాపాడింది. ఎక్కడో చైనాలో భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా వైరస్‌‌కు చిక్కుకోకుండా తన యజమానికి మేలు చేసింది. అది చేసిన పనికి ఆ యజమాని తొలుత ఆగ్రహంతో రగిలిపోయింది. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని భావోద్వేగానికి గురైంది.
Samayam Telugu this dog destroy woman passport to wuhan right before coronavirus outbreak
మహిళను కరోనా వైరస్ నుంచి కాపాడిన కుక్క, ఆ పిచ్చి పని చేయకపోతే..


Also Read: షాకింగ్.. జనాలపై ఉమ్ములేస్తున్న కరోనా రోగులు, చైనాలో అలజడి!

తైవాన్‌కు చెందిన ఓ మహిళ జనవరి 13న ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టింది. తాను అత్యవసర పని మీద చైనాలోని ఉహాన్ వెళ్లాల్సి ఉందని, ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి తన పెంపుడు కుక్క కిమీ నా పాస్‌పోర్టును చింపి ముక్కలు చేసిందని పేర్కొంది. ఇప్పుడు తాను ఎలా అక్కడికి వెళ్లాలని ఫ్రెండ్సును కోరింది.

Also Read: కరోనా వైరస్.. ఎలుకలు, గబ్బిలాలను తింటున్న చైనా ప్రజలు

కొద్ది రోజుల కిందట ఆమె ఇంకో పోస్టు పెట్టింది. ‘‘మీకు గుర్తుందా? నా పెంపుడు కుక్క కిమీ పాస్‌పోర్టును చింపేసినట్లు పోస్టు పెట్టాను. అది అలా చేయడం వల్ల నాకు ఎంతో మేలు జరిగింది. అది పాస్‌పోర్టు చింపి ఉండకపోతే నేను కూడా ఉహాన్‌లో ఆ వైరస్‌కు చిక్కేదాన్ని. కిమీ నా ప్రాణాలను కాపాడింది’’ అని పేర్కొంది. ఈ పోస్టు చూడగానే జనాలు కిమీని ప్రశంసలతో ముంచెత్తారు. కిమీ ముందుగానే ఆ ముప్పును గ్రహించి ఆమె ప్రాణాలు కాపాడిందని అంటున్నారు. కుక్కలకు సిక్త్ సెన్స్ కూడా ఉంటుందని, అందువల్లే అది పాస్‌పోర్టును చింపి యజమానిని కాపాడిందని తెలుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.