యాప్నగరం

Doordarshan Tune Tik Tok: దూరదర్శన్ న్యూస్ మ్యూజిక్‌కు అదిరిపోయే డ్యాన్స్, వీడియో వైరల్!

డీడీ న్యూస్ మ్యూజిక్‌కు బ్రేక్ డ్యాన్స్ స్టెప్పులు.. ఈ వీడియో చూస్తే దూరదర్శన్ కూడా ఆశ్చర్యపోతుంది!

Samayam Telugu 6 Mar 2019, 4:22 pm
‘టిక్ టాక్’ పుణ్యమా అని ఇప్పుడు ఎంతోమంది తమ టాలెంట్‌ను వీడియోల రూపంలో బయటపెడుతున్నారు. కొంతమంది డబ్ స్మాష్‌లతో ఆకట్టుకుంటుంటే.. మరికొందరు విన్యాసాలు, డ్యాన్సులతో మెస్మరైజ్ చేస్తున్నారు. తాజాగా దూరదర్శన్‌ (డీడీ) న్యూస్ మ్యూజిక్‌కు ఓ యువకుడు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఇందులో డీడీ మ్యూజిక్‌ను అనుగుణంగా అతడు వేసిన స్టెప్పులు చూస్తే ఔరా అనకుండా ఉండలేరు.

Read also:
దూరదర్శన్ మ్యూజిక్‌.. ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో పిచ్చెక్కించాడు!
వైశాఖ్ నైర్ అనే యువకుడు డీడీ వార్తలకు సంబంధించిన ఒకప్పటి సంగీతానికి బ్రేక్ డ్యాన్స్‌తో అదరగొట్టాడు. ఈ వీడియోను సిల్క్ అనే యూజర్ ట్వీట్ చేసింది. ఇప్పటివరకు ఈ వీడియోను 1.85 లక్షలు మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో చూసి ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు. ‘‘ఈ కుర్రాడు జనరేటర్ శబ్దానికి కూడా డ్యాన్స్ చేసేయగలడు’’ అని కొందరు, టిక్ టాక్‌లో ఇదే బెస్ట్ వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఏమన్నారో ఈ కింది కామెంట్స్‌లో చూడండి. వైశాఖ్ డ్యాన్స్‌ను పై వీడియోలో చూడగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.