యాప్నగరం

వీడియో: కొండ చిలువ పొగరు.. పులికి చెమటలు, చివరికి దారిచ్చింది!

కొండ చిలువ పొగరు ముందు పులి తలవంచక తప్పలేదు. పోరాటం లేకుండానే.. పులి శాంతి దూతలా కొండ చిలువకు దారిచ్చి.. తన దారి తాను చూసుకుంది.

Samayam Telugu 21 Jul 2020, 5:14 pm
పాముల్లో అత్యంత బలశాలి కొండ చిలువ ఓ వైపు.. వేటలో రాజీ పడని పెద్ద పులి మరో వైపు. రెండూ ఒకదానికి ఒకటి ఎదురుపడితే? ఇంకేమైనా ఉందా? యుద్ధం జరగాల్సిందే. తాడో పేడో తేల్చుకోవల్సిందే. కానీ, ఇక్కడ జరిగింది వేరు. పులిని చూసి కొండ చిలువ ఏ మాత్రం భయపడలేదు. కానీ, పులి ఎందుకో వెనకబడింది. కొరలతో చీల్చి చెండాడే ఆ పులి ఎందుకో వెనకడుగు వేసింది.
Samayam Telugu Image: Twitter


Also Read: ఆ హీరో కారులో ఆత్మ.. అతడి మరణం తర్వాత భయానక ఘటనలు

ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద పోస్టు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘కొండ చిలువకు దారి వదిలిన పులి’’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఆ వీడియోలో.. పులి, కొండ చిలువ ఒకదాన్ని ఒకటి ఎదురుపడ్డాయి. పులి వెళ్తున్న మార్గానికి అడ్డంగా కొండ చిలువ పడుకుని ఉంది. అది అక్కడి నుంచి వెళ్లిపోతుందని పులి చాలా సేపు ఎదురు చూసింది. కానీ అది కదల్లేదు. పైగా.. దాన్ని దాటి వెళ్లేందుకు ముందుకెళ్తున్న పులిని చూసి బుస కొట్టి భయపెట్టింది.

Also Read: ఈ మెసేజ్ చదివితే.. ఆత్మ వెంటాడుతుంది, ఈ వీడియోలో దెయ్యం ఆమేనా?

దీనితో ఇప్పుడు గొడవ ఎందుకని పులి భావించిందో ఏమో.. కొండ చిలువను డిస్ట్రబ్ చేయకుండా పక్కనే ఉన్న పొదల మార్గం నుంచి కొండ చిలువను దాటుకుని వెళ్లిపోయింది. ఈ వీడియోపై నెటిజనులు జోకులు పేల్చుతున్నారు. ‘పులి’ పరువు తీశావ్ అని కొందరు అంటుంటే. ‘‘సారీ, నా కడుపు నిండుగా ఉంది. నిన్ను తినే టైమ్ లేదు’’ అని పులి పక్క నుంచి వెళ్లిపోయిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. బహుశా.. ఇది వెజిటేరియన్ పులి కాబోలని మరికొందరు అంటున్నారు. ఈ వీడియో చూసి మీకు ఏమనిస్తుందో చెప్పండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.