యాప్నగరం

చైర్ ఛాలెంజ్.. ఈ స్టంట్ కేవలం ఆడవాళ్లు మాత్రమే చేయగలరట! మీరూ ట్రై చేస్తారా?

సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న ఈ ‘టిక్‌టాక్ చైర్ ఛాలెంజ్’ను మీరు చేయగలరా? ఇది కేవలం మహిళలు మాత్రమే చేయగలరట. అదెలాగో చూడండి.

Samayam Telugu 3 Dec 2019, 7:43 pm
సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఛాలెంజ్‌లు భలే ఫన్నీగా ఉంటాయి. ఐస్ బకెట్ ఛాలెంజ్ నుంచి బాటిల్ క్యా్ప్ ఛాలెంజ్ వరకు ఎన్నో సవాళ్లు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఛాలెంజ్ కూడా నెటిజనులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే, ఈ ఛాలెంజ్ పురుషులు చేయడం చాలా కష్టమని, కేవలం మహిళలకు మాత్రమే సాధ్యమని చెబుతున్నారు.
Samayam Telugu e8186fa_chair-challenge-tiktok-challenge_625x300_03_December_19
Image credit: Twitter


ఏం చేయాలి?:
‘చైర్ ఛాలెంజ్’‌ లేదా ‘టిక్‌టాక్ చైర్ ఛాలెంజ్’ అనే ఈ సవాల్ ప్రకారం.. ముందుగా ఒక కూర్చీని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత గోడ నుంచి మూడు అడుగులు వెనక్కి నడవాలి. ఆ తర్వాత ముందుకు వంగి తలను గోడను ఆన్చాలి. ఆ తర్వాత దగ్గరలో ఉన్న కూర్చీని లాగి పొట్టను తాకేలా పైకెత్తాలి. ఆ తర్వాత ఆ కూర్చీని పట్టుకుని నిలుచోవాలి. అయితే, ఈ స్టంట్ కేవలం మహిళలు మాత్రమే చేయగలుగుతున్నారు. పురుషులకు మాత్రం సాధ్యం కావడం లేదు. కేవలం కొంతమంది పురుషులు మాత్రమే కష్టపడి ఈ సవాల్ గెలుస్తున్నారు. ఈ కింది ట్వీట్లు చూసి మీరు కూడా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.