యాప్నగరం

వంతెనపై చిందులు.. తీగ తెగడంతో నీటిలో పడ్డ పర్యాటకులు!

వంతెనలపై చిందులు తొక్కితే ఇట్టాగే ఉంటుంది.. వేలాడే వంతెనపై ఉయ్యాలాటలు ఆడిన పర్యాటకులు నీటిలో పడ్డారు.

Samayam Telugu 11 Apr 2019, 5:43 pm
వేలాడే వంతెనలపై నడక సరికొత్త అనుభూతి కలిగిస్తోంది. అలాగని దానిపై చిందులు తొక్కితే ఏమవుతుందో తెలుసుకోవాలంటే చైనాలో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకోవల్సిందే. చైనాలో నిత్యం పర్యాటకులతో కళకల్లాడే జియంగ్సులో చెక్కలతో తయారు చేసిన వేలాడే వంతెనపై పదుల సంఖ్యలో చేరిన పర్యాటకులు దాన్ని అటూ ఇటూ ఊపారు.
Samayam Telugu 463daibg_bri


దానికి ఒక వైపు ఉన్న తీగలు తెగడంతో అంతా నీటిలో పడిపోయారు. అదృష్టం కొద్ది ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. లోతు తక్కువగా ఉండటం వల్ల అంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, పర్యాటకుల తీరుపై కొంతమంది నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి చేష్టలతో వంతెనను నాశనం చేశారని, దాన్ని ఊపిన ప్రతి ఒక్కరి నుంచి డబ్బులు వసూళ్లు చేసి వంతెన నిర్మించాలని కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియోను ఇక్కడ చూడండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.