యాప్నగరం

బాబోయ్ గ్రీన్ అనకొండ.. ఆగిన ట్రాఫిక్.. వీడియో వైరల్

గ్రీన్ అనకొండ రోడ్డు దాటడం మీరెప్పుడైనా చూశారా. ఇదిగో చూడండి. అనకొండ రోడ్డు మీదకు రావడంతో దెబ్బకు ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Samayam Telugu 30 Apr 2019, 10:05 pm
రోడ్డు మీద పాము వెళ్లడం మీరెప్పుడైనా చూశారా? మరి అనకొండ వెళ్లడం? ఇదిగో చూసేయండి. బ్రెజిల్‌లోని పోర్టో వెల్హోలో ఓ గ్రీన్ అనకొండ రద్దీగా ఉండే రోడ్డును దాటుతుండగా స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. పది అడుగుల పొడవు, 30 కిలోల బరువు తూగే ఈ అనకొండ ఆహారం కోసం వెతుక్కుంటూ రోడ్డు మీదకు వచ్చి ఉంటుందని బయాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. కొందరు తమ వాహనాలను ఆపి పాము రోడ్డు దాటేలా సహకరించారు.
Samayam Telugu anakonda


ఆహారం కోసం సిటీలోకి కూడా వచ్చేసే ఈ పాములు ఎలుకలు, పిల్లులు, కుక్కల్లాంటి చిన్న చిన్న జంతువులను పట్టేసుకొని మింగేస్తాయి. ఎలుకలు ఉన్న చోటును ఇవి పసిగట్టి వచ్చేస్తాయి. కాబట్టి ఇవి ఇళ్లలోకి కూడా ప్రవేశించే అవకాశం ఉంది.
గ్రీన్ అనకొండలు ప్రపంచంలోనే అతిపెద్ద పాములు. ఇవి 29 అడుగుల పొడవు 550 పౌండ్ల వరకు బరువు పెరుగుతాయి. ఇవి భూమ్మీది కంటే నీటిలో ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతాయి. ఇవి ఎక్కువగా అమెజాన్‌ రెయిన్ ఫారెస్ట్‌లో ఉంటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.