యాప్నగరం

video: అతని ప్రాణాలు కాపాడిన ట్రైన్ డ్రైవర్‌.. నెటిజన్ల ప్రశంసలు

ఆ ట్రైన్ డ్రైవర్ స్పందించిన తీరు అందరికీ నచ్చుతోంది. అతను అలర్ట్‌గా ఉండటం వల్ల ఓ నిండు ప్రాణాన్ని కాపాడినట్లైంది. దీనిపై రైల్వే శాఖ ఏం చెప్పిందో, అసలేం జరిగిందో తెలుసుకుందాం.

Samayam Telugu 3 Jan 2022, 1:02 pm
తన జీవితంలో ఏ సమస్య వచ్చిందో, ఏమోగానీ... ఓ వ్యక్తి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. మహారాష్ట్ర... ముంబైలోని శివ్దీ స్టేషన్ దగ్గర్లోని రైల్వే ట్రాక్‌ పైకి వెళ్లాడు. రైలు ఎప్పుడొస్తుందా అని చూశాడు. తను ఉన్న పట్టాలపై ఓ రైలు రావడాన్ని చూశాడు. అదే సరైన టైమ్ అనుకుంటూ... పట్టాలపై పడుకున్నాడు. మొదట్లో రెండు కాళ్లు మాత్రమే పట్టాలపై ఉంచిన అతను.. రైలు దగ్గరకు వచ్చేస్తున్న సమయంలో... తల తప్ప మిగతా శరీరమంతా పట్టాలపై ఉండేలా పడుకున్నాడు. అప్పుడే జరిగిందో అద్భుతం. (indian railways video)
Samayam Telugu ప్రాణాలు కాపాడిన ట్రైన్ డ్రైవర్ (image credit - twitter - @RailMinIndia)


పట్టాలపై ఎవరో ఉన్నట్లు గుర్తించిన ట్రైన్ డ్రైవర్... వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు. దాంతో ఆ వ్యక్తికి కొన్ని అడుగుల దూరంలోనే రైలు ఆగిపోయింది. ఆ తర్వాత రైల్వే పోలీసులు అతన్ని పట్టాలపై నుంచి తరలించేందుకు పరుగున అక్కడికి వెళ్లారు. అలా అతన్ని అక్కడి నుంచి తరలించారు. ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. వీడియోలో కనిపిస్తున్న టైమ్‌ని బట్టీ ఇది ఉదయం 11.45కి జరిగినట్లు తెలుస్తోంది (viral train video).

ఈ ఫుటేజ్‌ని ట్విట్టర్‌లోని తమ అకౌంట్‌ (Ministry of Railways)లో పోస్ట్ చేసింది రైల్వే శాఖ. "మోటర్‌మేన్ మెచ్చుకోతగ్గ పని చేశారు. ట్రాక్‌పై ఎవరో ఉన్నట్లు గుర్తించి, చాలా వేగంగా పరిస్థితిని గ్రహించి... ఎమర్జెన్సీ బ్రేక్ వేసి.. ప్రాణం కాపాడారు. మీ జీవితం ఎంతో విలువైనది. ఇంటి దగ్గర మీ కోసం ఎదురుచూసేవాళ్లు ఉంటారు" అని రైల్వే శాఖ వీడియోకి క్యాప్షన్ పెట్టింది (train driver saves life).

ఆ వీడియో (viral video)ని ఇక్కడ చూడండి

డ్రైవర్‌పై ప్రశంసల జల్లు:
ఈ వీడియోని ఇప్పటివరకు 92వేల మందికి పైగా చూశారు. దాదాపు 6వేల మంది లైక్ చేశారు. మంచి పని చేసిన ట్రైన్ డ్రైవర్‌ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కొంతమంది పట్టాలపై పడుకున్న వ్యక్తిని తప్పుపడుతున్నారు.

"చాలా మెచ్చుకోతగ్గ పని. అలాగే సెక్యూరిటీ కూడా వెంటనే స్పందించి స్పాట్‌కి వెళ్లి అతన్ని అక్కడి నుంచి తొలగించారు" అని ఓ యూజర్ మెచ్చుకోగా... "మద్యం తాగినట్లున్నాడు. రైలు పట్టాలే ఇల్లు అనుకొని నిద్రపోవడానికి ప్రయత్నించినట్లున్నాడు" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

"మరోసారి ఆ మోటర్‌మేన్ పేరు చెప్పలేదు. దయచేసి రియల్ హీరోల పేర్లు కూడా చెప్పండి. అందుకు వాళ్లు అర్హులు. గొప్ప పనులు చేసిన వాళ్లకి ఫేమ్ రావాలి" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.