యాప్నగరం

ఫైర్ దోశ.. దీని తయారీ చూస్తే నోరెళ్లబెడతారు!

ఇండోర్‌లో మంటపై తయారు చేస్తున్న ‘ఫైర్ దోశ’ను చూసి నెటిజనులు ఫిదా అవుతున్నారు.

Samayam Telugu 23 Jul 2021, 9:38 pm
ప్పటివరకు మీరు ప్లెయిన్ దోశ, ఉల్లి దోశ, మసాల దోశ, కారం దోశ, ఎగ్ దోశల గురించే తెలిసి ఉంటుంది. దక్షిణాది అల్పాహారమైన దోశ ఉత్తరాదికి చేరుకొనేసరికి ఎన్నో మార్పులు చేసుకుంటోంది. పిజ్జా, బర్గార్ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో వ్యాపారులు కొత్త రకం దోశలను కూడా రంగంలోకి దించుతున్నారు. చీజ్, బటర్‌, కూరగాయలను ఉపయోగించి రకరకాల దోశలను తయారు చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. తాజాగా.. ‘ఫైర్ దోశ’ కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే మంటల్లో వేసి కాల్చేస్తారా? అని అనుకుంటున్నారా? అయితే, మీరు ఈ వీడియో చూడాల్సిందే.
Samayam Telugu Image Credit: foodie_incarnate/Instagram


ఇండోర్‌లోని ఓ హోటల్‌లో ఈ ‘ఫైర్ దోశ’ను తయారు చేస్తున్నారు. అమర్ శిరోహీ అనే అనే ఫుడ్ బ్లాగర్ ఇటీవల ఈ దోశ తయారీ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇక తయారీ విధానం చూస్తే.. దోశల పిండిని పెనం మీద వేసిన తర్వాత బటర్, కారం పొడి, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, టమోటా, మొక్క జొన్న గింజలు, కొత్తిమీర చల్లాడు. తర్వాత లిక్విడ్ చీజ్, టమోటా సాస్ వేసి బాగా కలిపాడు. తర్వాత దోశను ఐదు భాగాలు చేశాడు. ఆ తర్వాత ఫ్యాన్ ద్వారా మంటను పెంచి దోశ పై భాగం కూడా కాలేలా కాల్చాడు. అనంతరం మరోసారి చీజ్ వేసి బాగా కాల్చాడు. ఆ తర్వాత దోశ ముక్కలను గుండ్రంగా చుట్టాడు. చివర్లో మరోసారి లిక్విడ్ చీజ్, చీజ్ వేసి అందించాడు. చెప్పాలంటే.. ఈ దోశలో ఎక్కువగా చీజ్‌నే ఉపయోగించారు. ఈ వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పండి.

వీడియో:
View this post on Instagram A post shared by Amar Sirohi (@foodie_incarnate)
Read Also:

రాత్రయితే.. ఈ కోటలో అంత అరాచకమా, ఇక్కడికి ఒంటరిగా వెళ్లకండి!

కన్నె పిల్లలే టార్గెట్.. సెక్స్ చేసి హత్యలు, భార్య సాయంతో భర్త అరాచకాలు.. మిస్టరీ వీడిందిలా!

మిస్సైన ఆ విమానం 35 ఏళ్ల తర్వాత.. 92 అస్థిపంజరాలతో ల్యాండైంది!

16 ఏళ్ల వయస్సు.. మాంసం ముద్దలా మారిన శరీరం, ఆమెను అలా చేసింది ఎవరు?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.