యాప్నగరం

‘వాంటెడ్’ ఫొటో నచ్చలేదని పోలీసులకు సెల్ఫీ పంపిన నేరగాడు

వాంటెడ్ ప్రకటనలో పోలీసులు పెట్టిన ఫొటో ఆ నేరగాడికి అస్సలు నచ్చలేదు. ‘‘ఆ ఫోటో తీసేసి నా లేటెస్ట్ ఫొటో వాడండి’’ అని సెల్ఫీ పంపి మరీ పోలీసులను రిక్వెస్ట్ చేశాడు.

Samayam Telugu 5 Aug 2019, 8:18 pm
రారిలో ఉన్న ఓ నేరగాడు.. ‘వాంటెడ్’ ప్రకటనలో పెట్టిన తన ఫొటో బాగాలేదంటూ ఓ పోలీసులకు లేటెస్ట్ సెల్ఫీ పంపాడు. ఈ ఘటన లింకన్‌షైర్‌లో చోటుచేసుకుంది. 33 ఏళ్ల మాజీ మోడల్ స్టెఫెన్ మర్ఫీ ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో పోలీసులు అతడి ఫొటోను వాంటెడ్ లిస్టులో పెట్టారు. అయితే, ఆ ఫొటో అతడికి నచ్చలేదు. దీంతో ఓ సెల్ఫీ పంపాడు.
Samayam Telugu df


‘‘నా చెత్త ఫొటోలను తీసేసి మంచి ఫొటోలను వాడండి. ఒక వేళ నేను బోస్టన్‌కు వస్తే మీరు గుర్తుపట్టి పట్టుకోవడం సులభం అవుతుంది’’ అని ఓ పత్రిక ద్వారా వెల్లడించాడు. అంతేగాక తన ఫేస్‌బుక్ పేజ్‌లో కూడా ఈ విషయాన్ని తెలిపాడు. తాను ఫుట్‌బాల్ క్రీడాకారుడు డెవిడ్ బెక్‌హమ్ కంటే అందంగా ఉంటానని తెలిపారు. అలాగే డాలర్లను ఛాతిపై పెట్టుకున్న మరో ఫొటోకు కూడా పోలీసుల కోసం పోస్టుచేశాడు. స్టెఫెన్ మర్ఫీ బోస్టన్‌లో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్నట్లు తెలిసింది. మర్పీ మాజీ మిస్టర్ బోస్టన్ పోటీల్లో విజేత కావడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.