యాప్నగరం

పసిబిడ్డలతో మహిళా పోలీసులు.. వారి సేవకు నెటిజన్స్ ఫిదా

పసిబిడ్డలను ఎత్తుకుని లాలిస్తున్న ఈ మహిళా పోలీసులకు నెటిజన్లు సలాం చేస్తున్నారు. ‘తల్లి’ మనసుకు ఇంతకంటే మంచి నిదర్శనం ఏముంటుంది చెప్పండి.

Samayam Telugu 13 Nov 2019, 11:46 am
ఖాకీ మనసులు కఠినంగా ఉంటాయని అంతా భావిస్తారు. కానీ, పోలిసులంతా అలా ఉండరని, వారికి కూడా మంచి మనసు ఉంటుందని ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. ఇందులో పసిబిడ్డలను ఎత్తుకుని ప్రేమగా లాలిస్తున్న ఈ మహిళ పోలీసులను చూస్తే.. వారే ఆ బిడ్డల తల్లలనే భావన కలుగుతుంది. కానీ, ఆ పసివాళ్లు వారి బిడ్డలు కాదు. టెట్ పరీక్షలు రాసేందుకు వచ్చిన అభ్యర్థుల పిల్లలు.
Samayam Telugu Photo Credit: Twitter/Assam Police
Photo Credit: Twitter/Assam Police


Also Read: విద్యార్థులను సమాధిలో పడుకోబెడుతున్న యూనివర్శిటీ.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఈ అరుదైన దృశ్యం అస్సాంలోని దార్రంగ్ జిల్లాలో కనిపించింది. నవంబరు 10న జరిగిన టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీఈటీ) సందర్భంగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా పోలీసులు.. పసిబిడ్డలతో పరీక్ష కేంద్రానికి వచ్చిన తల్లులను చూసి చలించిపోయారు. వెంటనే వారి నుంచి పసిబిడ్డలను తీసుకున్నారు.

Also Read:
గున్నను రక్షించిన సిబ్బందికి కృత‌జ్ఞతలు చెప్పిన ఏనుగు, వీడియో వైరల్

ఈ ఫొటోను అస్సాం పోలీసులు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ దృశ్యాన్ని చూడగానే నెటిజనులు ఆశ్చర్యపోయారు. ఆ మహిళా పోలీసుల మంచితనానికి ఫిదా అవుతున్నారు. ఈ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.