యాప్నగరం

Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై యువతి డాన్స్.. వీడియోకి 2.5 కోట్ల వ్యూస్

ఆ వీడియోలో యువతి తరచూ రోడ్లపై, పబ్లిక్ ప్లేసుల్లో డాన్స్ వేస్తోంది. తాజాగా రైల్వే ప్లాట్‌ఫామ్‌పై వెయ్యడంతో... నెటిజన్లు ఆ వీడియోను తెగ చూస్తున్నారు.

Samayam Telugu 18 Oct 2021, 1:57 pm
సాత్ సముందర్ పార్ సాంగ్‌కి ఓ యువతి రైల్వే ప్లాట్‌ఫామ్‌పై డాన్స్ వేసిన వీడియో... సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఆమె పేరు సహేలీ రుద్ర (Saheli Rudra). ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్. రీమిక్స్ ట్రాక్‌కి రైల్వే ప్లాట్‌ఫామ్‌పై డాన్స్ వేస్తూ కనిపించింది. ఆ సమయంలో అక్కడ చుట్టూ రైల్వే ప్రయాణికులున్నారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కొంత మంది ఆమెను ఇలా ఇక్కడ డాన్స్ చేస్తోందేంటి అన్నట్లు చూస్తున్నారు. మీరు తరచూ ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవుతున్నట్లైతే... మీకు ఇలాంటి వీడియోలు ఈమధ్య ఎక్కువగా కనిపిస్తూనే ఉన్న విషయం తెలుస్తుంది. ఇలా చాలా మంది పబ్లిక్‌లో డాన్సులు వేస్తూ ఆ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోకి 20 లక్షలకు పైగా లైక్స్ రాగా... 18వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. (railway platform song video)
Samayam Telugu సహేలీ రుద్ర (image credit - instagram - _sahelirudra_)


ఈ వీడియోలో సహేలీ రుద్ర వేగంగా డాన్స్ వేయడమ కాదు... సాంగ్‌కి తగినట్లుగా మూమెంట్స్ ఇచ్చింది. డాన్స్ చేస్తున్నా... పబ్లిక్‌లో ఉంది కాబట్టి మాస్క్ తొలగించలేదు. ఆమె వేస్తున్న డాన్స్ చూసి కొంత మంది భలే వేస్తోందే అన్నట్లు చూస్తున్నారు. అందుకే ఈ వీడియోకి 2.5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

వీడియో (viral video)ని ఇక్కడ చూడండి
View this post on Instagram A post shared by Saheli Rudra | Influencer (@_sahelirudra_)

సాత్ సముందర్ పార్ అనే పాట విశ్వాత్మ లోనిది. అందులో దివ్యభారతి, సన్నీ డియోల్ నటించారు. ఆ ఒరిజినల్ మ్యూజిక్ వీడియోని ఇక్కడ చూడండి.

సహేలీ రుద్ర ఇదివరకు కూడా రైల్వే ప్లాట్‌ఫామ్‌లు, పబ్లిక్ ప్లేసెస్‌లో డాన్సులు వేసింది. ఆ వీడియోలను ఇక్కడ చూడండి.
View this post on Instagram A post shared by Saheli Rudra | Influencer (@_sahelirudra_)

View this post on Instagram A post shared by Saheli Rudra | Influencer (@_sahelirudra_)

View this post on Instagram A post shared by Saheli Rudra | Influencer (@_sahelirudra_)

సహేలీ తాజా వీడియోపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. "ఆమె ఎక్కడున్నా ఆనందం పంచుతుంది" అని యూజర్ కామెంట్ ఇచ్చారు. "ఈమెను ఎవరైనా మంచి డాక్టర్‌కి చూపించండి" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. "సిగ్గులేదు" అని మరో యూజర్ స్పందించారు. "ఫేమస్ అవ్వడానికి ఈ రోజుల్లో ఎక్కడైనా, ఏమైనా చేస్తున్నారు" అని మరో మహిళా యూజర్ కామెంట్ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.