యాప్నగరం

కస్టమర్స్ కాదు.. హైదరాబాద్ హోటల్‌లో ‘జొమాటో’ క్యూ, నెటిజన్స్ జోకులు!

హైదరాబాద్ బిర్యానీకి ఎంత డిమాండు ఉందో తెలిపేందుకు ఇదే నిదర్శనం. ఇక్కడ కస్టమర్స్ కంటే జొమాటో డెలివరీ బాయ్‌సే ఎక్కువగా కనిపిస్తున్నారట.

Samayam Telugu 12 Apr 2019, 4:55 pm
రోజుల్లో ఆహారం కోసం హోటళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ మొబైల్‌లో యాప్ ఉంటే చాలు.. మీరు ఎక్కడుంటే అక్కడికి ఆహారం వచ్చేస్తోంది. దీంతో జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్‌ డెలవరీ యాప్స్‌కు డిమాండు బాగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని హోటళ్లలో కస్టమర్లు కంటే ఎక్కువగా ఫుడ్ డెలవరీ బాయ్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు.
Samayam Telugu D3xHDVFXsAAQeZO


తాజాగా ‘జోమాటో’ ఓ హోటల్ వద్ద ఫుడ్ డెలవరీ బాయ్స్ క్యూలో నిల్చున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటో వైరల్‌గా మారింది. వీరంతా హైదరాబాద్‌లోని బవర్చి బిర్యానీ ఔట్‌లెట్ వద్ద ‘హైదరాబాదీ బిర్యానీ’ ఆర్డర్స్ తీసుకెళ్లేందుకు క్యూలో నిలుచున్నారని పేర్కొంది. అంటే, నగరంలో బిర్యానీకి ఎంత డిమాండు ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ హోటల్‌లో బిర్యానీ కోసం రోజుకు 2000 ఆర్డర్లు వస్తున్నాయని జొమాటో తమ వార్షిక నివేదికలో వెల్లడించింది. ‘‘హైదరాబాద్‌లోని బవర్చి బిర్యానీ రెస్టారెంట్ వద్ద తీసిన ఫొటో ఇది. రోజు ఈ హోటల్ ఫుడ్ కోసం వచ్చే ఆర్డర్స్ గురించి తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది’’ అని జొమాటో ఇండియా ట్వీట్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.