యాప్నగరం

Moon Allergy: అతనికి చందమామ అలెర్జీ వచ్చింది.. అదేంటో తెలుసా?

కొంతమందికి కొన్ని రకాల ఆహారాలు పడవు. వాటిని వాళ్లు ఫుడ్ అలర్జీ అంటారు. మరికొందరికి దుమ్ము పడదు. దాన్ని వారు డస్ట్ అలర్జీ అంటారు. అలాగే ఓ వ్యక్తికి చందమామ పడలేదు. దాన్ని సైంటిస్టులు మూన్ అలర్జీగా చెప్పారు. ఇది మనం తప్పక తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే... నాసా త్వరలో చందమామపై కాలనీ నిర్మించేందుకు రెడీ అవుతోంది. కానీ అక్కడికి వెళ్లే మనుషులు... మూన్ అలర్జీ నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు. అసలేంటి ఈ అలర్టీ... చందమామపై ఏం జరుగుతోంది? ఈ అలర్జీ వచ్చిన వ్యక్తి ఎవరు? తెలుసుకుందాం.

Authored byKrishna Kumar | Samayam Telugu 25 May 2022, 11:53 am
మీకు తెలుసు... 1972 తర్వాత చందమామపైకి ఎవ్వరూ వెళ్లలేదు. అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్ నాసా (NASA) తన అపోలో మిషన్ ప్రోగ్రామ్‌ని ఆపేసింది. అలా ఎందుకు ఆపేసింది అనే విషయంపై రకరకాల వాదనలు ఉన్నాయి. గ్రహాంతరవాసులు (Aliens) హెచ్చరించడం వల్లే ఆపేసిందనే ప్రచారం జరిగింది. అమెరికా ప్రభుత్వం మాత్రం నిధులు లేకపోవడం వల్లే ఆపేశామని చెప్పింది. మళ్లీ ఇప్పుడు ఆర్టెమిస్ (Artemis) అనే మిషన్‌ని నాసా ఆగస్ట్ 2022లో ప్రారంభిస్తోంది. దీని ద్వారా... చంద్రుడి దక్షిణ ధ్రువంపై మొదటిసారి మహిళా వ్యోమగామి (first female astronaut)నీ, మొదటి నల్లజాతి వ్యోమగామి (first astronaut of colour)నీ దింపాలని చూస్తోంది. 1972లో చివరిదైన అపోలో 17 తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ జర్నీ మొదలవుతోంది.
Samayam Telugu అతనికి చందమామ అలెర్జీ వచ్చింది (image credit - pixabay)


మరి ఈ సందర్భంగా ఓ విషయం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయ్యింది. అదే మూన్ అలర్జీ. హార్రిసన్ షుమిట్ (Harrison Schmitt) అనే వ్యోమగామి 1972లో చివరిసారిగా చంద్రుడిపై నడిచాడు (The last man to walk on the moon). ఆయనకు ఓ రకమైన అలర్జీ వచ్చింది. ఎందుకంటే ఆయన చంద్రుడిపై ఉన్న దుమ్మును అనుకోకుండా పీల్చాడు.
NASA - Asteroid: గ్రహశకలం వస్తోంది.. భూమిని ఢీకొట్టేది అదేనట
షుమిట్ వయసు అప్పుడు 37 ఏళ్లు (ఇప్పుడు 86 ఏళ్లు). అపోలో 17 మిషన్‌లో ఆయన ఉన్నాడు. 1972 డిసెంబర్ 11న అపోలో 17 మిషన్ చంద్రుడిపై దిగింది. ఆ సమయంలో చంద్రుడిపై రాళ్లు, మట్టిని సేకరించేందుకు షుమిట్ గంటలతరబడి అక్కడి ఉపరితలంపై ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో... కొన్ని దుమ్ము రేణువులు... స్పేస్ సూట్‌లో చిక్కుకున్నాడు. ఆయన స్పేస్ సూట్ తీసిన సమయంలో... ఆ రేణువులు... గాలిలో ఎగిరి.. ఆయన ముక్కులోకి వెళ్లాయి. "వెంటనే తేడా వచ్చింది" అని 2019లో స్టార్మస్ ఫెస్టివల్‌లో ఆయన చెప్పాడు. "ముక్కు లోపల ఉబ్బినట్లు అయ్యింది. కానీ కమంగా ఆ సమస్య తగ్గిపోయింది" అని తెలిపాడు. చందమామపై ఆయన 108 కేజీల రాళ్లు, మట్టిని సేకరించారు.
viral video: పీతను కత్తెరలా వాడి పఫర్ ఫిష్‌ని కాపాడాడు.. నెక్ట్స్ లెవెల్
ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే... చందమామపై జీవించడం తేలిక కాదు. కొన్ని రేణువులే ముక్కును దెబ్బతీసినప్పుడు... ఏకంగా కాలనీ ఏర్పాటు చేసుకొని చందమామపై జీవించడం దాదాపు అసాధ్యమైన విషయం. అనుక్షణం అప్రమత్తంగా ఉండటం మన వల్ల కాదు. ఎట్టిపరిస్థితుల్లో చందమామపై దుమ్ము మన బాడీకి టచ్ అవ్వకుండా చూసుకోవాలి అని నిపుణులు అంటున్నారు. దీనిపై లోతైన పరిశోధన జరపాలని మరికొందరు కోరుతున్నారు.

Mosquito Burger: ఆఫ్రికాలో దోమలతో బర్గర్.. వాళ్లకు అదే చికెన్ బర్గర్
చందమామపై నడిచిన వారిలో ప్రస్తుతం నలుగురు జీవించి ఉన్నారు. వారిలో షుమిట్ ఒకరు. మిగతా వారు బుజ్ ఆల్డ్రిన్ (Buzz Aldrin), డేవిడ్ స్కాట్ (David Scott), చార్లెస్ డ్యూక్ (Charles Duke). షుమిట్... 1975లో రాజకీయాల్లోకి వెళ్లాడు. 1977లో అమెరికా సెనెటర్ అయ్యాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.