యాప్నగరం

Breatharian Monk Prahlad Jani: సైన్స్ కే అర్ధం కానీ ఒక వింత మనిషి ..!!

ఒక పూట ఆహరం లేకపోతేనే విలవిలలాడిపోతాము అలాంటిది ఒక వ్యక్తి 70 ఏళ్లుగా అవి తినడమే మానేసాడట. సైన్స్ కే అర్ధం కానీ వింత మనిషి వున్నాడు. అతను 70 సంవత్సరాల నుండి ఆహరం లేకుండా ఎలా ఉండగలుగుతున్నాడో తెలుసుకుందాం.

Samayam Telugu 31 Dec 2018, 11:29 am
ప్రపంచంలో జీవించే మనుషులందరూ మనకు తెలిసి ఆహరం తీసుకొనే జీవిస్తుంటారు. మనిషి అనేవారు కచ్చితంగా ఆహారం,నీరు లేకుండా బ్రతకలేరు ఆలా తినకుండా, తాగకూడిన జీవించే వ్యక్తి వున్నాడు అంటే నమ్ముతారా. అవునండి సైన్స్ కే అర్ధం కానీ వింత మనిషి వున్నాడు. ఇతను 70 సంవత్సరాల నుండి తినకుండా ఎం తాగకుండా జీవిస్తున్నాడు.
Samayam Telugu did yogi prahlad jani really survived without food and water since 1940
Breatharian Monk Prahlad Jani: సైన్స్ కే అర్ధం కానీ ఒక వింత మనిషి ..!!

ఆయన పేరు ప్రహ్లాద జని ప్రజలంతా మాతాజీ అని పిలుస్తారు, కొంత మంది భక్తులు చుందాదివాలా మాతాజీ అని కూడా పిలుస్తారు. ప్రహ్లాద జని ఆహారం లేకుండా ఒక్క పూట ఉండటమే కష్టం కానీ ఒకవ్యక్తి గత 70 సంవత్సరాలుగా ఎలాంటి ఆహారం లేకుండా కనీసం పచ్చి మంచి నీళ్లు లేకుండా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తన దరిచేరకుండా బ్రతుకుతున్నాడు. ఈ మాతాజీ ప్రస్తుతం గుజరాత్ లోని చారద అనే గ్రామంలో ఉంటున్నారు.
ప్రహ్లాద జని ఎప్పుడైతే అమ్మవారిని గాఢంగా నమ్ముకుంటూ వచ్చాడో తన ఆకలిని కూడా అమ్మవారే తీరుస్తుంది అని నమ్మేవారు. తనకు ఆకలిగా ఉన్నప్పుడు అంబ దేవత తన అంగడి 'నుదిటి 'పై నీటి బిందువులను జారవిడిచి ఆకలి తీర్చేదట. ప్రహ్లాద జని ఎర్రచీర, ఆభరణాలను ధరించి, జుట్టును పెంచుకొని, జుట్టుకు పూలు పెట్టుకునేవాడట.తెల్లవారుజామున ఉదయం 4 గంటలకే నిద్ర లేచి తలా స్నానం చేసి, పూజలు పూర్తిచేసి అంబదేవత ధ్యానంలో ఉంటూ దేవతను ఆరాధించేవాడు.

ప్రహ్లాద జని నీరు ఆహరం నిజంగా తీసుకోకుండా ఎలా జీవిస్తున్నాడు అని ఆ ఊరి జనాలు చాల సార్లు పరీక్షించి విఫలం అయ్యారు. గ్రామస్తుల కథనాల ప్రకారం మాతాజీ తన ఏడేళ్ల వయసులో రాజస్థాన్ లో ఉన్న తన ఇంటి నుండి పారిపోయి అడవులలో జీవించేవాడట. కొద్దీ రోజులు గడిచిన తర్వాత తన 11 వ యేటా అడవిలో ఉండే ఒక గుడిలోని అంబ దేవతను భక్తి శ్రద్దలతో పూజించడం మొదలుపెట్టాడు . అలా దేవత ధ్యానంలో ఉంటూ అంబ దేవతలాగే వస్త్రాలను అలంకరించుకునేవాడట.

ప్రహ్లాద జని ఇలా ఆహారం ఏమి తీసుకోకుండా ఎలా బ్రతకగలుగుతున్నాడో అని డాక్టర్లకు సైతం అర్థం కావడంలేదు. డాక్టర్ సుధీర్ షా తో పాటు మరో 35 మంది డాక్టర్స్ ఇండియన్ డిఫెన్స్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఫిజియాలజీ మరియు లాయిడ్ ఆర్గనైజేషన్ తో పాటు కొన్ని సంస్థలు కలసి మాతాజీ ని ఒక గదిలో ఉంచి అక్కడ సీసీ కెమెరాలు పెట్టి రోజు బ్లడ్ టెస్ట్, స్కానింగ్ ఇలా చాల రకాల పరీక్షలు జరిపారు. మెడికల్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ అని వచ్చాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.