యాప్నగరం

DB Cooper: అతనెవరు.. ఎలా మాయమయ్యాడు.. మిస్టరీ కేసు

ఎలాంటి కేసునైనా ఇట్టే సాల్వ్ చేసే FBI ఈ కేసును మాత్రం పరిష్కరించలేకపోయింది. చేతులెత్తేసింది. అసలు ఈ షాకింగ్ కేసు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Samayam Telugu 20 Oct 2021, 3:35 pm
అది 1971 నవంబర్ 24 బుధవారం. అమెరికా... ఒరెగాన్ లోని పోర్ట్‌లాండ్ నుంచి... వాషింగ్టన్ లోని సీటిల్ వెళ్లేందుకు నార్త్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం 305లో ప్రయాణించేందుకు వన్ వే టికెట్ $20 (రూ.1500) పెట్టి కొన్నాడు డేనియల్ కూపర్ (Daniel Cooper). అతని వయసు 40 ఏళ్లు ఉండొచ్చు. ఖరీదైన బిజినెస్ సూట్ ధరించాడు. దానిపై ఓవర్ కోట్ వేసుకున్నాడు. గోధుమ రంగు కలర్ షూస్ వేసుకున్నాడు. వైట్ షర్ట్ ధరించాడు. బ్లాక్ టై పెట్టుకున్నాడు. తనతోపాటూ ఓ సూట్ కేస్, ఓ బ్రౌన్ పేపర్ బ్యాగ్ తీసుకెళ్లాడు. విమానంలో కూర్చున్నాక... అది ఇంకా బయలుదేరకముందే... ఫ్లైట్ అటెండెంట్‌ని పిలిచి... తనకు ఓ బార్బన్, సోడా కావాలని అడిగాడు. ఆమె సరే తెచ్చి ఇస్తానని వెళ్లింది. ఇంతలో విమానం బయలుదేరింది. ఫ్లైట్ అటెండెంట్ బార్బన్, సోడా తెచ్చి ఇచ్చింది. విమానం గాలిలో ఉంది. అప్పుడు ఆమెకు ఓ నోట్ ఇచ్చాడు. ఆమె దాన్ని తీసుకొని క్యాజువల్‌గా పాకెట్‌లో పెట్టుకుంది. అది చూసిన కూపర్... "హలో మిస్.. నువ్వు ఆ నోటును తెరచి చూడాలి. నా దగ్గర బాంబు ఉంది" అని చెప్పాడు. తన బ్రీఫ్ కేసులో బాంబు ఉందని చెప్పి... ఆమెను తన పక్కన కూర్చోమన్నాడు. భయపడిన ఆమె... నమ్మాలో వద్దో అర్థం కాక... సరే అని అతని పక్కన కూర్చుంది. తన సూట్ కేసు తెరచి చూపించాడు. అందులో ఎరుపు రంగులో రెండు కడ్డీలు ఉన్నాయి. వాటి చుట్టూ రకరకాల వైర్లు ఉన్నాయి. (image credit - wikipedia)
Samayam Telugu most unsolved mystery case the strange disappearance of db cooper full details here
DB Cooper: అతనెవరు.. ఎలా మాయమయ్యాడు.. మిస్టరీ కేసు


భారీగా డబ్బు డిమాండ్:

కూపర్ సూట్ కేసు మూసేసి.. నేను చెప్పేది జాగ్రత్తగా రాసుకో... అంటూ ఏదో చెప్పాడు. అదంతా రాసుకుంది. ఇదంతా వెళ్లి కెప్టెన్‌కి చెప్పు అన్నాడు. ఆమెకు ఇచ్చిన నోట్‌లో "నాకు సాయంత్రం 5 గంటలకల్లా $200,000 (రూ.1,49,78,300) కావాలి. ఆ డబ్బు 20 డాలర్ల నోట్ల రూపంలో ఉండాలి. వాటిని ఓ సంచిలో ఉంచాలి. అలాగే నాకు రెండు బ్యాక్ పారాచ్యూట్‌లు, రెండు ఫ్రంట్ పారాచ్యూట్‌లు కావాలి. విమానం ల్యాండ్ అవ్వగానే... వెంటనే ఇంధనం నింపేందుకు ఎయిర్‌పోర్టులో ఇంధన ట్రక్ రెడీగా ఉండాలి. తేడా చేశారో... బాంబు పేలుతుంది" అని రాసి ఉంది. ఫ్లైట్ అటెండెంట్ ద్వారా విషయం FBI ఏజెంట్లకు తెలిసింది. వెంటనే వారు అతను అడిగిన విధంగా డబ్బును సీటిల్ ఏరియా బ్యాంకుల నుంచి తెప్పించారు. అలాగే సీటిల్ పోలీసులు స్థానిక స్కైడైవింగ్ స్కూల్ నుంచి ప్యారాచూట్‌లు తెప్పించారు. (image credit - wikipedia)

అంతా తన ఇష్టప్రకారమే:

కూపర్ అడిగినవి రెడీ చేశారు. విమానం సీటిల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. కూపర్... కొంత మంది ప్రయాణికుల్ని, కొంత మంది సిబ్బందినీ విమానం దిగేందుకు ఒప్పుకున్నాడు. మిగతా వారిని విమానంలోనే ఉండమన్నాడు. ఆ తర్వాత విమానంలో ఇంధనాన్ని నింపమన్నాడు. మెక్సికో సిటీ మీదుగా 10,000 అడుగుల ఎత్తులో విమానాన్ని నడపమన్నాడు. సీటిల్ నుంచి విమానం టేకాఫ్ అయ్యింది. ఈ జర్నీ అంతటా అతను ప్రత్యేకమైన డార్క్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. అందువల్ల అతని చిత్రం గీసేందుకు క్రైమ్ పరిశోధకులకు ఈజీ అయ్యింది. అంతేకాదు.. చాలా మంది అతని కేసుపై తమదైన శైలిలో దర్యాప్తు చేశారు. అఫ్‌కోర్స్ ఎవరూ కేసును ఛేదించలేకపోయారు. (image credit - wikipedia)

ఏమైపోయాడు:

సీటిల్ నుంచి బయలుదేరిన విమానం గాలిలో ఎగురుతూ ఉండంగా... రాత్రి 8 దాటాక... నెవాడాలోని సీటిల్, రెనో మధ్యలో ఓ చోట... కూపర్... విమాన వెనక డోర్‌ను తెరిపించి... కిందకు దూకేశాడు. తనతోపాటూ డబ్బు, రెండు పారాచ్యూట్‌లను పట్టుకెళ్లాడు. కానీ అతను మళ్లీ ఎవరికీ కనిపించలేదు. కూపర్ కోసం 50 ఏళ్లుగా వెతికినా పలితం లేకపోయింది. అసలు అతను ఎవరో, ఎలా బాంబు తెచ్చాడో, విమానం నుంచి దూకాక ఏమయ్యాడో, ఎటు వెళ్లాడో ఏ వివరాలూ తెలియలేదు. FBI, అమెరికా చరిత్రలో ఇదో అత్యంత రహస్యమైన కేసుగా మిగిలిపోయింది. (image credit - wikipedia)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.