యాప్నగరం

Bermuda Triangle: అంతరిక్షంలో బెర్ముడా ట్రయాంగిల్.. ఎక్కడుందో తెలుసా?

బెర్ముడా ట్రయాంగిల్ అనగానే మనకు దక్షిణ అమెరికా పక్కనున్న సముద్రంలోని ఊహాత్మక బెర్ముడా ట్రయాంగిల్ గుర్తుకురావడం సహజం. కానీ అలాంటివి మరికొన్ని భూమిపై ఉన్నాయి. అంతరిక్షంలో కూడా ఒకటి వుండటం నమ్మలేని విషయం. కానీ నిజంగానే ఉంది. అది ఎక్కడుంది? దాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అని ఎందుకు అంటున్నారు? అక్కడ ఏదైనా మిస్సవుతోందా? దాని గురించి వ్యోమగాములు ఏం చెబుతున్నారు? విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన ఈ విషయాన్ని ఇప్పుడు చర్చించుకుందాం.

Authored byKrishna Kumar | Samayam Telugu 27 Apr 2022, 12:31 pm
మన అంతరిక్షం భలే ఉంటుంది కదా. రాత్రి వేళ చుట్టూ లైట్లు ఆర్పేసి వున్న సమయంలో... మీరు అంతరిక్షాన్ని అలా చూస్తూ ఉంటే... మొదట మీకు నాలుగైదు నక్షత్రాలే కనిపిస్తాయి. అర నిమిషం తర్వాత ఆ సంఖ్య 10కి చేరుతుంది. అలా మీరు 2 నిమిషాలపాటూ చూస్తే... మీకు దాదాపు వెయ్యి నక్షత్రాలు కనిపిస్తాయి. అదే మీరు సిటీలో కాకుండా... ఏ పల్లెటూరులోనో ఉండి చూస్తే... మీకు లక్ష నక్షత్రాల దాకా కనిపిస్తాయి. అదే మీరు హిమాలయాలు, ఎడారి మధ్య నుంచి చూస్తే... మీకు కోట్ల నక్షత్రాలతో పాలపుంత (Milkyway galaxy) కనిపిస్తుంది. ఇలా ఈ విశ్వం మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. సరే ఇప్పుడు మనం అంతరిక్షంలో బెర్ముడా ట్రయాంగిల్ సంగతులు తెలుసుకుందాం.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం (image credit - pixabay)


విచిత్రమైన అనుభూతి:
ఒక్కసారి ఊహించుకోండి.. మీరు చీకట్లో వెళ్తూ ఉన్నారు. సడెన్‌గా ఓ ఫ్లాష్ లైట్ మీ కళ్లకు తగిలితే ఏం చేస్తారు. దాన్ని చూడలేక కళ్లను మూస్తారు. తలను పక్కకు తిప్పుతారు. ఆటోమేటిక్‌గా మీ చెయ్యి... కళ్లకు అడ్డుగా వస్తుంది. ఇవన్నీ సహజ చర్యలు. ఇదే అనుభూతి... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉంటున్న వ్యోమగాముల (astronauts)కు అప్పుడప్పుడూ కలుగుతుంది. వాళ్లు సౌత్ అట్లాంటిక్ అనామలీ (SAA) ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఇలా వారికి అనిపిస్తుంది. ఆ ప్రాంతాన్నే అంతరిక్ష బెర్ముడా ట్రయాంగిల్ (Bermuda Triangle of space) అంటున్నారు.
viral video: మొసలి, కొండచిలువ ఫైట్.. ఏది గెలిచిందో చూడండి
SAA ప్రాంతంలో ఏముంది?
మన భూమి చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రం (magnetic field)... మన భూమి తిరిగే అక్షానికి తగ్గట్టు లేదు. మీకు తెలుసుగా భూమి 23 డిగ్రీలు పక్కకు వంగి తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అయస్కాంత క్షేత్రం కూడా అలా వంగాలి. కానీ అది అలా పర్ఫెక్టుగా వంగలేదు. భూ అయస్కాంత క్షేత్రంలో... 2 వలయాలు (rings) వంటివి ఉన్నాయి. వాటిలో ధనావేశ మూలకాలు (charged particles) బంధీ అయివున్నాయి. ఆ రింగులనే సైంటిఫిక్ భాషలో వాన్ అల్లెన్ రేడియేషన్ బెల్ట్స్ (Van Allen radiation belts) అంటారు. వాన్ అల్లెన్ బెల్ట్స్ కొద్దిగా పక్కకు వంగివున్నాయి. అందువల్ల దక్షిణ అట్లాంటిక్ మహా సముద్రంపై ఈ రేడియేషన్ బెల్ట్స్ 200 కిలోమీటర్ల పరిధిలో విస్తరించివున్నాయి. అందువల్ల ఈ ప్రాంతంలోకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వెళ్తే... కంప్యూటర్లు పనిచేయడం మానేస్తున్నాయి. వ్యోమగాములకు ఫ్లాష్ లైట్స్ అనుభవం కలుగుతోంది.
Galaxy X: విచిత్రమైన గెలాక్సీ.. పాలపుంత గెలాక్సీలోనే ఉంది
పూర్తిగా తెలియదు:
ఈ రోదసీ బెర్ముడా ట్రయాంగిల్ గురించి సైంటిస్టులకు పూర్తిగా తెలియదు. ధనావేశ మూలకాల వల్లే ఇలా జరుగుతోందని భావిస్తున్నారు. వీటిని పరిశీలించడం హబుల్ స్పేస్ టెలిస్కోప్ (Hubble space telescope) వల్ల కావట్లేదు. కానీ భవిష్యత్తులో వాణిజ్యపరంగా స్పేస్ ట్రావెల్ (space travel) అమల్లోకి రావాలంటే దీని సంగతి తేలాల్సిందే. లేదంటే అంతరిక్షంలో ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో రహస్యాల్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. దీన్ని కూడా ఛేదిస్తారని అనుకుందాం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.