యాప్నగరం

భారత్‌లో విడుదలైన వివో వి5 ప్లస్

చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో తన సరికొత్త వి5 ప్లస్ మొబైల్‌ను సోమవారం భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

TNN 23 Jan 2017, 5:23 pm
చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో తన సరికొత్త వి5 ప్లస్ మొబైల్‌ను సోమవారం భారత మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ధర రూ. 27,980. ప్రత్యేకంగా సెల్ఫీల కోసం రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్ జనవరి 31 నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో లభించనుంది. అయితే ఈ వివో వి5 ప్లస్ ఒక రంగులో మాత్రమే లభించనుంది. వైట్, గోల్డ్ కాంబినేషన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ దొరుకుతుంది.
Samayam Telugu vivo v5 plus with dual selfie cameras launched in india at rs 27980
భారత్‌లో విడుదలైన వివో వి5 ప్లస్


వివో వి5 ప్లస్‌లో రెండు సెల్ఫీ కెమెరాలు ఉండటం విశేషం. ఒకటి సోనీ ఐఎంఎక్స్376 సెన్సార్, f/2.0 అపెర్చ్యూర్‌తో కూడిన 20 మెగాపిక్సెల్ కాగా, మరొకటి 8 ఎంపీ కెమెరా. వెనుకవైపు 16 ఎంపీ కెమెరాను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ‘మూన్‌లైట్ గ్లో’ ఫీచర్‌తో అతితక్కువ వెలుతురు ఉన్న చోట కూడా అద్భుతమైన సెల్ఫీలు తీసుకోవచ్చు.

వివో వి5 ప్లస్ స్పెసిఫికేషన్లు
5.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ఐపీఎస్ డిస్ప్లే
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మైక్రోఎస్డీతో 256జీబీ వరకు పెంచుకోవచ్చు)
16 ఎంపీ వెనుక కెమెరా, 20ఎంపీ + 8ఎంపీ ఫ్రంట్ కెమెరాలు
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాల్ ఆపరేటింగ్ సిస్టమ్
క్విక్ చార్జింగ్ టెక్నాలజీతో 3,160 ఎంఏహెచ్ బ్యాటరీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.