యాప్నగరం

మరో నెలలో భూమి అంతమైపోతుందంటూ పుకార్లు!

సెప్టెంబరు 20 -23 తేదీల మధ్య భూ గ్రహం అంతమైపోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ మూడు రోజుల వ్యవధిలో నిబిరు అనే గ్రహం భూమిని ఢీకొట్టడంతోందని అంటున్నారు.

TNN 30 Aug 2017, 2:01 pm
సెప్టెంబరు 20 -23 తేదీల మధ్య భూ గ్రహం అంతమైపోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ మూడు రోజుల వ్యవధిలో నిబిరు అనే గ్రహం భూమిని ఢీకొట్టడంతో ముక్కలపైపోయి సమస్త జీవరాశి అంతమై పోతుందని కాన్‌స్పిరసీ థియరిస్ట్ డేవిడ్ మీడ్ వెల్లడించారు. మరో 24 రోజులు మాత్రమే మానవాళి మనుగడని, దీనిపై బైబిల్‌తో పాటు గిజా పిరమిడ్‌లోనూ స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఏవైనా తీరని కోరికలుంటే మిగిలుంటే, ఈ లోగానే వాటిని నెరవేర్చుకోవాలని సలహా కూడా ఇస్తున్నారు. ఈ ఏడాది భూమి అంతమవుతందని గతంలో చెప్పిన మీడ్, ఇప్పుడు ఆ తేదీలను కూడా వెల్లడించడం గమనార్హం. సెప్టెంబరు రెండో వారం నుంచి నిబిరు గ్రహాన్ని ప్రజలందరూ స్పష్టంగా చూడవచ్చని తెలిపారు.
Samayam Telugu will septembers solar eclipse cause the world to end
మరో నెలలో భూమి అంతమైపోతుందంటూ పుకార్లు!


అంతేకాదు దీనికి సంకేతమే ఆగస్టు 21 న ఏర్పడిన సూర్యగ్రహణమని పేర్కొన్నారు. ఇదే భూమికి చివరి గ్రహణమని వ్యాఖ్యానించాడు. ఈ రహస్య గ్రహం వల్ల భూమి అంతరిస్తుందని తెలియజేశాడు. పురాతన బైబిల్‌లోని 13 అధ్యాయం 9 నుంచి 10 పేరాల్లో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు వివరించాడు. ఆ రోజు దేవుడు భూమిపైకి కోపంతో, భయంకరంగా విచ్చేసి పాపాత్ములను నాశనం చేస్తాడని డేవిడ్ మీడ్ అన్నాడు. అంతేకాదు నక్షత్రాలు కూడా ప్రకాశించవని, సూర్యుడు కూడా కనిపించడని, చంద్రుడు వెలుగులు ఉండవని వెల్లడించారు.

ఆగస్టు 21 న ఏర్పడిన సూర్యగ్రహణం తర్వాత సూర్యుడు కాంతి కూడా తగ్గిపోయిందని ఈ సిద్ధాంతకర్తలు పేర్కోవడం విశేషం. అయితే, నిబిరు గ్రహం ప్రస్తావన 2016 జనవరిలో తొలిసారిగా వచ్చింది. ప్రస్తుతం ఇది సౌర కుటుంబానికి అంచున ఉండగా, దీనికి ప్లానెట్ ఎక్స్ గా పిలుస్తున్నారు. వాస్తవానికి ఇది ఓ ఊహాజనిత గ్రహం. కొన్ని వందల ఏళ్ల కిందట ఇది భూ కక్ష్యలోకి ప్రవేశించిందని విశ్వసిస్తున్న కాన్‌స్పిరసీ థియరిస్టులు ఇప్పుడు కూడా మరోసారి అదే జరగనుందని నమ్ముతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.