యాప్నగరం

తక్కువ ధరకే షియోమి స్మార్ట్ షూస్!

తక్కువ ధరలకే ఎక్కువ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్న ప్రముఖ చైనా కంపెనీ షియోమి తాజాగా స్మార్ట్ షూస్‌ను విడుదల చేసింది.

TNN 10 Mar 2017, 3:16 pm
Samayam Telugu xiaomi launches smart shoes powered by intel
తక్కువ ధరకే షియోమి స్మార్ట్ షూస్!
తక్కువ ధరలకే ఎక్కువ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్న ప్రముఖ చైనా కంపెనీ షియోమి తాజాగా స్మార్ట్ షూస్‌ను విడుదల చేసింది. 2015లోనూ షియోమి స్మార్ట్ షూస్‌ను విడుదలచేసింది. అయితే తాజా స్మార్ట్ షూస్‌ ఇంటెల్ ప్రాసెసర్‌తో రావడం విశేషం. ‘90 మినిట్స్ ఆల్ట్రా స్మార్ట్ స్పోర్ట్స్‌వేర్’ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్ షూస్‌లో ఇంటెల్ బటన్ సైజ్ క్యూరీ మాడ్యూల్ చిప్‌సెట్‌ను అమర్చారు.

ఈ కొత్త స్మార్ట్‌ షూస్ 60 రోజుల బ్యాటరీ లైఫ్‌ని ఇస్తాయని కంపెనీ వెల్లడించింది. వీటిని ధరించిన వ్యక్తి చేసిన వాకింగ్, రన్నింగ్ దూరాన్ని ఇవి రికార్డ్ చేస్తాయి. ఈ షూస్‌లో రికార్డయిన డాటా ద్వారా మనం ఎంత దూరం ప్రయాణించాం, మనం వెళ్లిన వేగమెంత, ఎన్ని కేలరీల శక్తి ఖర్చయింది తదితర విషయాలు తెలుసుకోవచ్చు. ఈ షూస్‌ను మెత్తగా, జారిపోకుండా ఉండేలా షియోమి రూపొందించింది.

మగవారికి బ్లాక్, సర్ఫ్ బ్లూ రంగుల్లోనూ... మహిళలకు బ్లాక్, పింక్ రంగుల్లో ఈ షూస్ లభిస్తాయి. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ షూస్ త్వరలోనే భారత మార్కెట్‌లోకి రానున్నాయి. వీటి ధర సుమారు రూ. 2,800గా ఉండనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.