యాప్నగరం

ఆ ఫోన్ ఇప్పుడు జియోను సపోర్ట్ చేస్తుంది!

రిలయన్స్ జియో అందిస్తోన్న ఉచిత 4జీ సేవలను చాలా మంది స్మార్ట్‌ఫోన్ ఔత్సాహికులు విచ్చలవిడిగా ఉపయోగించేస్తు్న్నారు.

TNN 6 Jan 2017, 5:57 pm
రిలయన్స్ జియో అందిస్తోన్న ఉచిత 4జీ సేవలను చాలా మంది స్మార్ట్‌ఫోన్ ఔత్సాహికులు విచ్చలవిడిగా ఉపయోగించేస్తు్న్నారు. అయితే కొంతమంది ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నప్పటికీ అవి సరికొత్త 4జీ వీవోఎల్టీఈ టెక్నాలజీతో వచ్చిన జియో నెట్‌వర్క్‌ను ఉపయోగించలేకపోతున్నారు. ఇలాంటి స్మార్ట్‌ఫోన్లలో వన్‌ప్లస్ 2 ఒకటి. జియో నెట్‌వర్క్ రాకమునుపే వన్‌ప్లస్ ఈ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. అయితే వన్‌ప్లస్ 2 యూజర్ల బాధను అర్థం చేసుకున్న కంపెనీ త్వరలో 4జీ వీవోఎల్టీఈ సపోర్ట్‌ను ఈ ఫోన్లకు కల్పించనున్నట్లు గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించింది.
Samayam Telugu your oneplus 2 will now support reliance jios network
ఆ ఫోన్ ఇప్పుడు జియోను సపోర్ట్ చేస్తుంది!


అయితే కంపెనీ ప్రకటించినట్లుగానే భారత్‌లో ఉన్న వన్‌ప్లస్ వినియోగదారులకోసం కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. సుమారు 1.2జీబీ సైజున్న ఓటీఏను అప్‌డేట్ చేసుకుంటే మీ వన్‌ప్లస్ 2 ఫోన్‌లో 4జీ వీవోఎల్టీఈ సదుపాయం యాక్టివేట్ అవుతుంది. దీంతో పాటు యాప్ లాక్, బ్యాటరీ సేవింగ్ మోడ్‌లు అదనం. ఈ విధంగా అప్‌డేట్ చేసుకున్న తరవాత రిలయన్స్ జియో సర్వీసులను వాడటంతోపాటు వీవోఎల్టీఈ కాల్స్ కూడా మాట్టాడొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.